twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తమ సినిమా కాపీ కాదంటూ ప్రియమణి ఖండన

    By Srikanya
    |

    బెంగుళూరు: థాయ్ సినిమా 'ఎలోన్' ప్రేరణతో దీన్ని ఆయన తీశారు. అంతే కానీ ఇది దానికి కాపీ కాదు. ఈ సినిమాలో సెంటిమెంట్, లవ్, కామెడీ వంటి అంశాలున్నాయి. థ్రిల్లర్ తరహాలో పొన్ను కుమరన్ ఈ చిత్రాన్ని రూపొందించారు అంది ప్రియమణి. ఆమె తాజా చిత్రం 'చారులత' త్వరలో విడుదల అవుతోంది. గ్లోబల్‌వన్ పతాకంపై రమేశ్ కృష్ణమూర్తి నిర్మించిన 'చారులత' తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందింది. పొన్ను కుమరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తోంది.ఈ సందర్భంగా మీడియా వారితో మాట్లాడుతూ ఇలా స్పందించింది.

    'చారులత' అవిభక్త కవలల పాత్రలు చేసినందుకు ఓ నటిగా గర్విస్తున్నానని ప్రియమణి చెప్పారు. తెరమీదే ఇలాంటి అవిభక్త కవలల కథ ఇప్పటివరకు రాలేదు. అందుకే ఓ సవాలుగా ఆ కవలల పాత్రలు స్వీకరించా. వారికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. అయితే ఓ అబ్బాయి వారి జీవితంలో వస్తే ఎలాంటి పరిణామాలు సంభవించాయన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకమ్మాయి అమాయకంగా ఉంటే, ఇంకో అమ్మాయి గడుసుగా ఉంటుంది. ఇద్దరి భావోద్వేగాలు వేర్వేరుగా ఉంటాయి. ఒకే సంఘటనకి ఇద్దరూ వేర్వేరుగా స్పందిస్తుంటారు. ఈ పాత్రల్ని చేయడంలో నా బాడీ డబుల్ (డూప్) దీపిక పాత్ర ఎంతో ఉంది. నేనెంత కష్టపడ్డానో, నాతోనే ఉంటూ తనూ అంతే కష్టపడింది అంది.

    అలాగే నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పా. ఈ సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్‌కూ, నేపథ్య సంగీతానికీ చాలా ప్రాముఖ్యం ఉంది. కొన్ని సీన్లు ఒళ్లు జలదరింపజేస్తాయి. ఆ సన్నివేశాల్లో సుందర్ సి. బాబు మ్యూజిక్, పన్నీర్ సెల్వన్ సినిమాటోగ్రఫీ ఎంతో కీలకంగా వ్యవహరించాయి. అవార్డుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమా చేయలేదు. అవి వస్తే బోనస్‌గా భావిస్తా అంది. ఫస్ట్ లుక్ విడుదలకే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ పంపిణీ సంస్ధ గీతా డిస్ట్ర్రిబ్యూటర్స్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. గీతా వారు తీసుకోగానే ట్రేడ్ లో ఈ చిత్రంపై మంచి ఆసక్తి కలిగింది. ఇక ఈ చిత్రంలో ప్రియమణి అవిభక్త కవలలుగా కనిపించి అలరించనుంది. ప్రియమణి చేస్తున్న ఈ రెండు పాత్రలులో ఆమె డిపెరెంట్ గా ఉండబోతోంది.

    చిత్రం కథ విషయానికి వస్తే''పుట్టుకతోనే ప్రియమణిది తన సోదరితో విడదీయలేని బంధం. ఎందుకంటే శరీరాలు కలిసి జన్మించిన అవిభక్త కవలలు వారు. ఆనందంగా సాగిపోతున్న వారి జీవితంపై ప్రేమ అనే అంశం ఎలాంటి ప్రభావాన్ని చూపిందన్నదే అసలు కథ. అందులో ఒకరు విలన్ గా మారి మరొకరి జీవితంతో ఆడుకుంటారు. ఎవరు విలన్, ఎందుకలా నెగిటివ్ గా మారారు అన్నది మిగతా కథ.'చారులత' చిత్రంలో ప్రియమణి ఈ కవలల పాత్ర చేస్తున్నారు. థాయ్ చిత్రం 'అలోన్' ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పోన్‌కుమరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియమణి పాత్రల పేరు 'చారు, లత'. చారు, లతల్లో ఒక యువతి దూకుడు.. మరో యువతి అమాయకురాలు. ఈ రెండు పాత్రలకు సంబంధించిన సన్నివేశాలను ఒకదాని తర్వాత ఒకటి చిత్రీకరిస్తున్నారు. తమిళ చిత్రం 'పరుత్తివీరన్'తో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సాధించారు ప్రియమణి. ఆమెకు మరో జాతీయ అవార్డుని తెచ్చిపెట్టే చిత్రం ఇది అవుతుందనే అంచనాలు ఉన్నాయి.

    English summary
    Charulatha, which has National Award winning actress Priyamani playing conjoined twins, will be releasing on September 14. The forthcoming horror trilingual is an official remake of Thai-Korean film, "Alone" (2007) and the makers are making it in three languages - Telugu, Kannada and Tamil.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X