»   » ఇకనైనా మారండి,అది నాఇష్టం: ఘాటుగా స్పందించిన ప్రియమణి

ఇకనైనా మారండి,అది నాఇష్టం: ఘాటుగా స్పందించిన ప్రియమణి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణి. టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారుండరు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చుకుంది ఈ అమ్మడు. అయితే చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. పరిశ్రమలోకి ప్రవేశించిన తొలి రోజుల్లో "పెళ్ళైన కొత్తలో", "యమదొంగ" తదితర సినిమాల్లో మంచి నటన కనపరిచి ప్రేక్షకుల మనసు దోచుకుంది. తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేసి క్రమంగా సినిమాలకు దూరం అయింది.

నెమ్మదిగా తన కెరీర్ ఇక ముందుకు సాగే అవకాశం ఇక లేదు అని త్వరగానే అర్థం చేసుకున్న ప్రియమణి సరైన సమయం లోనే తన కెరీర్ని ముగించి సొంత జీవితాన్ని చక్కదిద్దుకునే పనుఇలో పడింది. త్వరలోనే తన ప్రియుడు ముస్తుఫా రాజ్ ను పెళ్లాడబోతోంది.

చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంటకు ఇటీవల కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. ఈ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకునేందుకు తన ఎంగేజ్ మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది ప్రియమణి. అయితే ఈ ఫొటోలకి వచ్చిన స్పందన మాత్రం ఆమెని బాదపెట్టేలా ఉంది.

Priyamani had removed her engagement photo from her social media account

ప్రియమణీ వివాహమాడబోయే వ్యక్తి ముస్లిం కావటం తో "ప్రియమణి లవ్ జిహాద్" వలలో పడిందంటూ కొందరు కామెంట్ చేసారు. కొంతమంది మితి మీరి మతాల ప్రసక్తి తెచ్చిమరీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ప్రియమణి స్పందించింది. లవ్ జిహాద్ అంటూ చేసిన కామెంట్లపై సీరియస్ గా స్పందించిన ప్రియమణి...

"నా జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్న నన్ను వీలైతే దీవించండి. సోషల్ మీడియాలో వస్తున్న మీ స్పందనలతో చికాకు పుడుతోంది. మీ సందేశాలతో మమ్మల్ని దీవించండి తప్ప ఇలాంటి నెగెటివ్ రియాక్షన్స్ మాత్రం వద్దు కనీసం మీరంతా ఇప్పటికైనా మారండి.

ఇది నా జీవితం.. నేను నా కుటుంబ సభ్యులకు, నేను చేసుకోబోయే వ్యక్తికీ తప్ప ఇంజ్క ఎవరికీ నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు". అంటూ ఘాటుగానే బదులిచ్చింది. అంతే కాదు సోషల్ మీడియా అక్కౌంట్ నుంచి తాను పోస్ట్Y చేసిన ఎంగేజ్ మెంట్ ఫొటోలను కూడా తొలగించేసింది. పాపం ప్రియమణి

English summary
Priyamani had posted a photo of her with Musthafa from the engagement function to her Twitter account. But, people who follows her greeted it with bad comments and reactions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu