»   » అనుష్కను మించిపోతూ చారిత్రక పాత్రలో గ్లామరస్ హీరోయిన్..!?

అనుష్కను మించిపోతూ చారిత్రక పాత్రలో గ్లామరస్ హీరోయిన్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

మధ్య కాలంలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లు ఫ్యాషన్ అయిపోయాయి. పైగా, ఆ ఎపిసోడ్ మీదే సినిమా ఆధారపడి వుందన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి కొన్ని సినిమాలలో అయితే చారిత్రక నేపథ్యం అన్నది ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లకు ఆయువుపట్టుగా నిలుస్తున్నాయి. ఇప్పుడు జగపతిబాబు, ప్రియమణి జంటగా నటిస్తున్న 'క్షేత్రం' సినిమాలో కూడా ఇలాంటి ఎపిసోడ్ మీదే కథంతా ఆధారపడివుందట.

నాగపెంచలమ్మగా ప్రియమణి, వీరనరసింహరాయలుగా జగపతిబాబు ఈ ఎపిసోడ్ లో ఆదరగొట్టేస్తారని దర్శకుడు వేణుగోపాల్ చెబుతున్నారు. ఆయా పాత్రల్లో ఆహార్యం నుంచి, అభినయం వరకు అన్నిటా ఓ గంభీరత ఉంటుందని ఆయన అంటున్నారు. నిన్న(జూన్6) నుంచి ఈ సినిమా తాజా షెడ్యూలు షూటింగు హైదరాబాదులో వేసిన సెట్లో జరుగుతుందని గోవిందరాజు చెప్పారు. కీలక సన్నివేశాలు, రెండు పాటలు చిత్రీకరిస్తామని అన్నారు. ఇటీవల అన్నీ గ్లామర్ పాత్రలే వేస్తున్న ప్రియమణికి ఇది డెఫినిట్ గా వెరైటీ అవుతుంది. అందుకే, ఈ సినిమా మీద ఆమె చాలా ఆశలే పెట్టుకుంది..!

English summary
The combination of Kerala beauty Priyamani and Jagapathi babu, the angry young man of Tollywood, though proved to be not very success, they have paired in four films earlier and again pairing for their upcoming movie ‘Kshetram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu