ప్రియమణికి మరికొంచెం పెంచమన్న నాగార్జున..
నాగార్జున, ప్రియమణి, అనుష్క కలయికలో వీరు పోట్ల దర్శకత్వంలో 'రగడ" పేరిట ఓ చిత్రం రూపొందుతుంది. కామాక్షి కళామూవీస్ పతాకంపై డి. శివప్రసాద్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో తన ప్రొఫెషనలిజంతో నాగార్జునని ప్రియమణి బాగా ఇంప్రెస్ చేసిందనేది ఇండస్ట్రీ టాక్. నాగార్జునతో ప్రియమణి 'రగడ" చిత్రంలో తొలిసారిగా నటిస్తోంది. అనుష్క మెయిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో రెండో హీరోయిన్ గా ఎవరినైనా తక్కువ రేంజ్ హీరోయిన్ చాలనుకుంటూ ఆ అవకాశాన్ని ప్రియమణికిచ్చారు. అయిష్టంగానే ఆమెతో 'రగడ" చేయడానికి సిద్దపడ్డ నాగార్జునకి ఇప్పుడు ప్రియమణి తెగ నచ్చేసిందంట. ఆమెకి వృత్తి పట్ల ఉన్న అంకిత భావాన్ని, కోస్టార్స్ కిచ్చే 'కోపరేషన్"ని చూసి నాగార్జున ప్లాటైపోయాడట.
అంతే..దర్శకుడు వీరు పోట్లకి ప్రత్యేకంగా చెప్పి మరీ ప్రియమణికి సీన్లు పెంచేలా చూశారు. అలాగే ముందు అనుకున్నదానికంటే ఒక పాట ఎక్కువ ఇవ్వమని ఆమెని ఎంకరేజ్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రియమణి కి అవకాశాలిమ్మని నాగార్జున ప్రత్యేకంగా రికమెండేషన్ కూడా చేస్తున్నారట. అనుష్కతో తెగిపోని బంధం కంటిన్యూ చేస్తున్న నాగార్జున ఇక మీదట తన సినిమాల్లో ప్రియమణికి సైతం రెగ్యులర్ గా చోటు దక్కేలా చూసుకుంటారేమో చూడాలి..


Click it and Unblock the Notifications











