ప్రియమణి జోలికివెళ్ళద్దు జాగ్రత్త

By Srikanya

ప్రియమణితో ఏమన్నా ప్లాన్స్ ఉంటే మానుకోవటం మంచిది అంటున్నారు. ఏమిటీ అంటే ఇప్పుడు ప్రియమణి కర్రసాము అనే విద్య నేర్చుకుని ఎలాంటివారినైనా ఎదిరించేందుకు సిద్దంగా ఉంది. ఇప్పుడామె కర్రసాములో మాస్టర్ అయ్యింది. అయితే హఠాత్తుగా ప్రియమణికి ఈ కర్రసాముపై దృష్టి ఎందుకు పడింది అంటే క్షేత్రం సినిమా కోసం అని తెలిసింది. జగపతి బాబుతో చేస్తున్న ఈ చిత్రంలో చేస్తున్న విభిన్నమైన పాత్ర కోసం ఈ కర్రసాము నేర్చుకుంది. ఆ విషయం ఆమె ప్రస్దావిస్తూ...నేను కర్రసాము నేర్చుకోవాలి అంటే మొదట భయపడ్డాను. కానీ తర్వాత కొద్ది రోజులు ప్రాక్టీసు చేసేటప్పటికి అందులో ఆరితేరిపోయాను. దాదాపు ఇప్పుడు కర్ర తిప్పటంలో నేను మాస్టర్ అయ్యిపోయాను.

కర్ర సాము అనేది ఓ పురాతన విద్య.మొదట్లో కర్ర తిప్పటం చాలా కష్టమనిపించింది. కానీ కథకు ఈ పార్ట్ చాలా అవసరం కావటంతో నేను పూర్తి దృష్టి పెట్టాను అంది. ఈ చిత్రంలో నేను చాలా యాక్షన్ సన్నివేసాలలో డూపు లేకుండా నేనే చేసాను అని చెప్పుకొచ్చింది. అలాగే ఈ చిత్రంల కత్తితో పోరాటం కూడా ఉంది కానీ అది ఎంతో సేపు కాదు..కాబట్టి పెద్ద గా ప్రాక్టీసు అవసరం లేకపోయింది అని చెప్పింది. చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ఆధునిక కాలంలో కొనసాగే ఈ చిత్ర కథ అనుకోకుండా ఓ చారిత్రక నేపథ్యంలోకి మలుపు తిరుగుతుంది. ఇందులో భాగంగా వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా వుంటుంది"" అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కోటి, కెమెరా: ఎమ్వీ రఘు, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, ఆర్ట్: రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అక్కినపల్లి విజయ్ ‌కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X