For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Priyanka Chopra: సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక చోప్రా.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సంచలన ప్రకటన

  |

  ప్రియాంక చోప్రా.. దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా ఈ బ్యూటీ దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తనదైన శైలి యాక్టింగ్‌తో పాటు చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. ఇక, కొన్నేళ్లు క్రితమే నిక్ జోనస్ అనే పాప్ సింగర్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ప్రియాంక.. తరచూ అతడితో రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

  అదే సమయంలో వీళ్లిద్దరూ తమ ప్రేమను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుచుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నిక్ జోనస్, ప్రియాంక చోప్రా ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అసలేం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

   ప్రపంచాన్ని గెలిచి.. స్టార్ హీరోయిన్‌గా

  ప్రపంచాన్ని గెలిచి.. స్టార్ హీరోయిన్‌గా

  చాలా చిన్న వయసులోనే మిస్ వరల్డ్‌గా గెలిచిన తర్వాత ప్రియాంక చోప్రా.. ఆ సమయంలోనే సినీ పరిశ్రమల్లోని దర్శక నిర్మాతల దృష్టిలో పడిపోయింది. దీంతో ఆమెకు సినిమాల ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 2002లో ‘తమీజాన్' అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు భాషల్లో నటించింది. అలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ప్రియాంక చోప్రా.. నిన్న మొన్నటి వరకూ వరుస సినిమాలతో హవాను చూపించింది.

  దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  హాలీవుడ్‌లోకి ఎంట్రీ.. అతడితో ప్రేమ

  హాలీవుడ్‌లోకి ఎంట్రీ.. అతడితో ప్రేమ

  దాదాపు రెండు మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ప్రియాంక చోప్రా.. కొన్నేళ్ల క్రితం హాలీవుడ్‌లోకి సైతం అడుగు పెట్టింది. ఇండియాలో మరెవరికీ సాధ్యం కాని రీతిలో అక్కడ కూడా ఈ అమ్మడు హవాను చూపించింది. ఈ క్రమంలోనే అందులో పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటించి సత్తా చాటింది. అలాగే, ప్రైవేట్ ఆల్బమ్‌లు కూడా చేసింది. దీంతో గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అక్కడ కెరీర్‌ను సాగిస్తోన్న సమయంలోనే నిక్ జోనస్ అనే అమెరికన్ పాప్ సింగర్‌తో ప్రియాంక ప్రేమలో పడిపోయింది.

  వయసులో తేడా.. అయినా పెళ్లికి రెడీ

  వయసులో తేడా.. అయినా పెళ్లికి రెడీ

  నిక్ జోనస్‌ తనకంటే వయసులో చిన్నోడే అయినప్పటకీ ప్రియాంక చోప్రా చాలా కాలం పాటు అతడితో డేటింగ్ చేసింది. ఇలా చాలా సార్లు విదేశీ మీడియా కెమెరాలకు చిక్కింది. పబ్లిక్‌లోనే ముద్దులు పెట్టుకోవడం.. హగ్స్ చేసుకోవడం వంటివి చేసింది. దీంతో ఈ వార్త బహిర్గతం అయిపోయింది. ఈ క్రమంలోనే ఇండియాలో అతడిని హిందూ, క్రిస్టియన్ పద్దతుల్లో వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి సినీ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చారు. దీంతో అప్పట్లో ఈ వేడుక అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అయింది.

  ముక్కు అవినాష్‌కు షాకిచ్చిన ఛానెల్: జబర్ధస్త్ మానేసి వస్తే.. వీళ్లు కూడా పక్కన పెట్టేశారంటూ!

  ఎప్పుడూ అతడితోనే ఉంటూ సందడి

  ఎప్పుడూ అతడితోనే ఉంటూ సందడి

  వివాహం తర్వాత ప్రియాంక చోప్రా లండన్‌కు మకాం మార్చేసింది. ఇండియాలో ఐదైనా షూటింగ్‌ కానీ, ఇతర పనులు కానీ ఉంటేనే స్వదేశానికి వస్తుంది. లేదంటే అక్కడే కాలం గడుపుతోంది. మరీ ముఖ్యంగా ఎప్పుడూ భర్త నిక్ జోనస్‌తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. ఈ క్రమంలోనే అతడికి ముద్దులు, హగ్గులు ఇస్తూ ప్రియాంక చోప్రా తరచూ ప్రేమను వ్యక్త పరుచుకుంటోంది. దీంతో తన భర్త అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసేలా పోస్టులు పెడుతోంది. నిక్ జోనస్ కూడా ప్రియాంకతో ఎక్కువ సమయం గడపుతుంటాడు. దీంతో ఈ జంట నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

  విడాకుల వార్తలు.. ఖండించిన భామ

  విడాకుల వార్తలు.. ఖండించిన భామ


  ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్ 2018 డిసెంబర్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచీ వీళ్లిద్దరూ తమ తమ కెరీర్‌లను సాగిస్తూనే.. జంటగానూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న వార్త ఒకటి ఆ మధ్య ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం ప్రియాంక.. తన సోషల్ మీడియా ఖాతాల్లో నిక్ పేరును తొలగించడమే. ఈ వార్తలు వైరల్ అవడంతో స్వయంగా ఈ బ్యూటీనే స్పందించింది. విడాకులు తీసుకోవడం లేదని తెలుపుతూ భర్తతో దిగిన పిక్స్‌ను షేర్ చేసింది.

  నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

  సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక... ప్రకటన

  సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక... ప్రకటన

  విడాకులు తీసుకుంటున్నారంటూ వస్తున్న వార్తలు ఇప్పుడిప్పుడే తగ్గుతోన్న నేపథ్యంలోనే ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ ఎవరూ ఊహించని న్యూస్‌ను చెప్పారు. వీళ్లిద్దరూ ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అవును.. మీరు చదివింది నిజమే. ప్రియాంక చోప్రా.. నిక్ జోనస్ తల్లిదండ్రులు అయినట్లు తాజాగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అదేంటి.. ప్రియాంక గర్భవతి కాలేదు కదా? అనుకుంటున్నారా? అవును.. ఆమె గర్భం దాల్చుకుండానే ఓ బిడ్డకు తల్లైంది. అదేనండీ.. సరోగసీ పద్దతి (అద్దె గర్భం) ద్వారా వీళ్లిద్దరూ పారెంట్స్ అయ్యారన్న మాట.

  Priyanka Chopra - Nick Jonas విడాకులు.. సెన్సేషనల్ రూమర్...!! || Filmibeat Telugu
  ప్రకటనలో ఏమని రాసుకొచ్చారంటే

  ప్రకటనలో ఏమని రాసుకొచ్చారంటే


  తాజాగా నిక్ జోనస్, ప్రియాంక చోప్రా తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఓ ప్రకటనను వదిలారు. అందులో ‘సరోగసీ ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చామని చెప్పడానికి మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాము. ఈ ప్రత్యేకమైన సమయంలో మేము మా కుటుంబం మీద దృష్టి సారించాలని అనుకుంటున్నాము. మా ప్రైవసీకి భంగం కలిగించకుండా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్యూ' అంటూ పేర్కొన్నారు. అయితే, వాళ్లకు పుట్టింది అమ్మాయా? అబ్బాయా? అన్నది మాత్రం ధృవీకరించలేదు. మొత్తానికి ఈ గ్లోబల్ కపుల్ భారీ షాకే ఇచ్చారు.

  English summary
  Priyanka Chopra Husband Nick Jonas Have welcomed a baby through surrogacy. The couple Announce This Via their respective social media handles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X