»   » దేశం తరఫున మరో భాధ్యత: యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ప్రియాంకా చోప్రా....

దేశం తరఫున మరో భాధ్యత: యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా ప్రియాంకా చోప్రా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా యునిసెఫ్ అంతర్జాతీయ సౌహార్ద రాయబారిగా నియమితులయ్యారు. యునిసెఫ్ 70వ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ ప్రకటన వెలువడింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా. మాజీ ప్రపంచ సుందరి అయిన ప్రియాంక చోప్రా...తాను కేవలం అందగత్తెను మాత్రమే కాదు, నటిని కూడా అని నిరూపించుకుంది.

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడంతో పాటు, భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికైంది. కేవలం తన టాలెంటును ఇండియాకే పరిమితం చేయకుండా ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయింది. ఇప్పటికే పలు పాప్ ఆల్బమ్స్ కూడా విడుదల చేసింది. అమెరికన్ టీవీ సీరిస్ లో నటించింది. దీంతో పాటు ప్రస్తుతం ఓ హాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తోంది.

బాలీవుడ్లో అందమైన హీరోయిన్ల టాప్ లిస్టులో ఉండే ప్రియాంక చోప్రా.... కెరీర్ తొలినాళ్లలో మోడలింగ్ రంగంలో చాలా కష్టపడింది. తనకంటే అందగత్తెలు ఆ ఫీల్డులో చాలా మంది ఉండటంతో తీవ్రమైన పోటీ ఎదుర్కొంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి ప్రపంచ సుందరిగా సత్తా చాటింది. ఆ ఎదుగుదల ఇప్పుడు ప్రియాంక ని ఒక ఉనంత స్థానానికి తీసుకువెళ్ళి తన భుజాలపై మరో భాధ్యతనుంచింది. ఇప్పుడు ప్రియాంక యునిసెఫ్ గ్లోబల్ గుడ్ విల్ అంబాసిడర్

 Priyanka Chopra


యునిసెఫ్ నూతన రాయబారిగా ప్రియాంక చోప్రాను నియమిస్తున్నట్లు ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హామ్, 12 ఏళ్ళ బ్రిటిష్ బాల నటి మిల్లీ బాబీ బ్రౌన్ ప్రకటించారు. ప్రియాంక చోప్రా మాట్లాడుతూ బాలల సంక్షేమం కోసం పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అణగారిన వర్గాలకు చెందిన బాలల ఉమ్మడి గొంతుగా మారాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.

రాబోయే తరాలకు ఉత్తమ భవిష్యత్తును ఇచ్చే దళంలో చేరాలని పిలుపునిచ్చారు. బాలలకు స్వేచ్ఛ లభించాలన్నదే తన ఆకాంక్ష అని,. ఆలోచించేందుకు, జీవించేందుకు వారికి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కావాలనీ. పెద్దలు అన్ని రంగాల్లోనూ మునుపెన్నడూ లేని అభివృద్ధి సాధిస్తున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా బాలలు హింస, దోపిడీ నుంచి రక్షణలేని స్థితిలో ఉంటున్నారన్నారబ్టూ తన ప్రసంగాన్ని కొనసాగించింది ప్రియాంక. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్య సమితి దౌత్యవేత్తలు, యునిసెఫ్ సౌహార్ద రాయబారులు, బాలలు పాల్గొన్నారు.

English summary
Actress Priyanka Chopra, who has created waves with her stint in the American drama series "Quantico", says she is honoured to serve as UNICEF's Global Goodwill Ambassador.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu