»   » అమ్మమ్మలా తయారైన అందాల హీరోయిన్

అమ్మమ్మలా తయారైన అందాల హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందాల నటి ప్రియాంక చోప్రా త్వరలో 65 ఏళ్ల అమ్మమ్మ అవతారంలో అలరించబోతోంది. ఆమె తాజాగా చేస్తున్న 'సాత్‌ ఖూన్‌ మాఫ్‌' అనే చిత్రం కోసం ఆమె ఈ కొత్త గెటప్ లో తన అభిమానులకు షాక్ ఇవ్వనుంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో ఆమె నసీరుద్దీన్ షా భార్యగా నటించనుంది. ముఫ్పై ఏళ్ళ తను అరవై ఐదేళ్ళ అమ్మమ్మగా మారేందుకు యూనట్ వారు కంప్యూటర్ గ్రాఫిక్స్ లో మేకప్ ఎట్లా చేసుకోవాలో చూపెట్టారు. అయితే ప్రియాంక అదేమీ అవసరం లేదని తన నాయనమ్మ ఫోటో తెప్పించుకుని అలా మేకప్ చేసుకుంటే చాలాని, న్యాచురల్ గా ఉంటుందని సూచించింది. ఫైనల్ గా ఆమెను ఆ గెటప్ లో చూసిన విశాల్ భరధ్వాజ్ స్టన్ అయ్యారని చెప్తోంది.ఈ విషయమై ప్రియాంక తల్లి తండ్రులు మాట్లాడుతూ...'మా అమ్మాయిది అచ్చం వాళ్ల అమ్మమ్మ పోలికే. ఆ కళ్లూ, ముక్కు, ఆ తీరు అలాగే ఉంటుది. అందుకే మేకప్ చేస్తే అలా కుదిరింది' అంటూ చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu