»   » భర్తలను హత్యచేసే ప్రియాంక చోప్రా

భర్తలను హత్యచేసే ప్రియాంక చోప్రా

Posted By:
Subscribe to Filmibeat Telugu

పైకి అందంగా, అమాయకంగా కనిపించే ప్రియాంక తను పెళ్ళి చేసుకున్న ఏడుగురు భర్తలను వరసగా చంపేస్తుంది. అయితే వారిని వరుసగా ఎందుకు హత్య చేస్తుందనేది ప్రస్తుతానికి రహస్యం అని దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ అంటున్నారు. ఆయన దర్శకత్వంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా చేస్తున్న ఓ హిందీ చిత్రంలో ఈ సంఘటన చోటు చేసుకోనుంది. ఇక ఈ చిత్రంలోనే ప్రియాంకకి ఏడుగురు భర్తలు ఉంటారు. ఇక ఏడుగురు భర్తలుగా ఎవరు నటిస్తున్నారనే విషయానికొస్తే.. జాన్‌ అబ్రహాం, మోహన్‌లాల్‌, నసీరుద్దీన్‌ షా, అర్షద్‌ వార్సి.. ఇప్పటివరకు ఈ నలుగురూ ఎంపికయ్యారు. ఐదో భర్తగా ఇర్పాన్‌ ఖాన్‌ని ఎన్నుకోవాలని విశాల్‌ భరద్వాజ్‌ అనుకుంటున్నారు. ఒక భర్తగా విదేశీయుడు నటించబోతున్నారని సమాచారం. ఇక మిగిలిన ఒకే ఒక్క భర్త పాత్రకి మాత్రం ఇంకా ఎవరూ ఖరారు కాలేదు. ఆంగ్ల చిత్రం 'సెవెన్‌ హజ్బండ్స్‌'ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu