»   » హీరోయిన్ ప్రియాంక చోప్రా తండ్రి మృతి

హీరోయిన్ ప్రియాంక చోప్రా తండ్రి మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా మృతి చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అశోక్ చోప్రా ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు.

గత కొన్నేళ్లుగా అశోక్ చోప్రా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. ఇప్పటికే ఆయనకు పలు సర్జరీలు కూడా జరిగాయి. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలువలేదు. అశోక్ చోప్రా చనిపోయిన విషయాన్ని ఆమె మేనేజర్ ధృవీకరించారు.

అశోక్ చోప్రా ఇండియన్ ఆర్మీలో పిజీషియన్‌గా పని చేసారు. వృత్తి రీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో పని చేసారు. తండ్రి మరణంతో ప్రియాంక చోప్రా కుటుంబం శోక సముద్రంలో మునిగి పోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే ప్రియాంక తన పనులు అన్ని పక్కనపెట్టి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుంది.

English summary

 Mumbai: Bollywood actress Priyanka Chopra's father Dr Ashok Chopra died at Kokilaben Dhirubhai Ambani Hospital, Mumbai, after suffering from cancer. Dr Chopra, who was suffering from the same, ever since 2008, had also undergone several medical surgeries and was critically ill. As per recent reports, PC's dad passed away this afternoon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu