For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నోరు అదుపులో లేక పరువు తీసుకున్న ప్రియాంకా: మండిపడుతున్న సిక్కిం వాసులు

  |

  కొన్ని సార్లు అత్యుత్సాహం పనికి రాదు ఒక విషయాన్ని చెప్పేవిధంగా చెప్పకపోతే తర్వాత వచ్చే రిజల్ట్ ఒక్కోసారి పరువు తీసెంతగా మారిపోవచ్చు. అందులోనూ సెలబ్రిటీలు అయితే ఆ విషయం మరీ ఎక్కువ ఉంటుంది. కొన్ని చిన్న విషయాలు అనిపించేవి కూడా సెలబ్రిటీల ఓవర్ రియాక్షన్ వల్ల మరింత పెద్దగా మారే చాన్స్ ఉంటుంది.ఇప్పుదు ప్రియాంకా చోప్రా కూడా అలాంటి వివాదం లోనే చిక్కుకుంది. ఒక సినిమా విషయమై మాట్లాడుతూ తమ రాష్ట్రాం మీద చేసిన వ్యాఖ్యలకు భగ్గుమన్నారు సిక్కిం ప్రాంత వాసులు...

  ప్రియాంకా చోప్రా

  ప్రియాంకా చోప్రా

  బాలీవుడ్ నుంచి ఇప్పుడు హాలీవుడ్ నటి అని కూడా అనిపించుకుంటున్న ప్రియాంకా చోప్రా నిర్మాతగా మారి "పహునా" అనే చిత్రాన్ని నిర్మించింది. సిక్కిం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో ఇద్దరు చిన్నారి శరణార్థుల మధ్య చోటు చేసుకునే పరిణామాలతో ఉద్వేగపూరితంగా తెరకెక్కించారు.

  టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌

  టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌

  పహునాను టొరంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా.. ప్రశంసలు దక్కాయి. చాలామంది ఈ సినిమాని తెగమెచ్చుకున్నారు. నిజానికి ఆ కంటెంత్ ని తెరకెక్కిక్కించిన విధానం కూడా అద్బుతం అనే చెప్పాలి. అయితే ఇంత మంది ఇన్ని రకాలుగా పొగిడే సరికి ఇక తాను ఆ సినిమాని ఎన్ని కష్టాలకోర్చి తీసానో అక్కడి వారికి చెప్పాలనుకుందేమో గానీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...

  ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది

  ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది

  ‘సిక్కిం ఈశాన్య భారతంలో ఓ చిన్న రాష్ట్రం. అక్కడ ఫిల్మ్ఇండస్ట్రీ లేదు.. కనీసం సినిమాలు తీసేందుకు కూడా ఎవరూ ముందుకు రారు. అందుకు కారణం నిత్యం అక్కడ తిరుగుబాటులు, అల్లర్లు చెలరేగి ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉంటుంది. అయినా అతి కష్టం మీద ఇబ్బందులను ఎదుర్కుని ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన తొలిచిత్రం పహునానే' అంటూ సినిమాటిక్ గా చెప్పింది.

  అక్కడ సినీ పరిశ్రమ ఉంది

  అక్కడ సినీ పరిశ్రమ ఉంది

  అయితే ఇక్కడ ప్రియాంకా పరువు తానే తీసుకుంటున్నానని మర్చి పోయినట్టుంది. చూడటానికి చిన్న రాష్ట్రమే అయినా సిక్కిం లోనూ వారి సినిమాలు వారు నిర్మించుకునే స్థాయిలో అక్కడ సినీ పరిశ్రమ ఉంది. అక్కడినుంచి ఈ మధ్య చాలా మంచి మంచి సినిమాలు వచ్చాయ్ కూడా..అందులో కొన్ని అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లోనూ ప్రదర్శితమయ్యాయి..

  ఎప్పుడైనా సిక్కిం మొహం చూసిందా

  ఎప్పుడైనా సిక్కిం మొహం చూసిందా

  అందులో ప్రశాంత్‌ రసయిలి లాంటి టాలెంటెడ్‌ దర్శకుడు తీసిన కథ, ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ యేడాది సిక్కిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన "ధోక్బు" కూడా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంది. ఇంత జరుగుతున్నా ప్రియాంకా మాత్రం అసలక్కడ జనం బతకటమే దుర్భరం అన్న స్థాయిలో మాటలు వాడేసింది. దాంతో కనీసం ఈమె ఎప్పుడైనా సిక్కిం మొహం చూసిందా? అన్న అనుమానం వస్తోంది అంటూ విమర్శలు మొదలయ్యాయి.

  తీవ్ర స్థాయిలో విమర్శలు

  తీవ్ర స్థాయిలో విమర్శలు

  సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లగక్కుతున్నారు. సిక్కిం చాలా ప్రశాంతతో కూడుకున్న రాష్ట్రమని కొందరు కామెంట్ చేస్తే.. అసలు సిక్కిం ఎక్కడ ఉంటుందో ప్రియాంకకు తెలుసా? అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు సిక్కిం ఫిల్మ్‌ ఇండస్ట్రీ గురించి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ప్రియాంకకు సూచిస్తున్నారు.

  English summary
  Priyanka Chopra courted controversy for calling Sikkim ‘troubled with insurgency’ at Toronto International Film Festival and adding Pahuna, a film produced by her, is the first film from the region.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X