twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక చోప్రా జీవితం పాఠ్యాంశంగా, విమర్శలు!

    By Bojja Kumar
    |

    ఢిల్లీ : బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా జీవిత కథ ఇప్పుడు బడిపిల్లల పాఠ్యాంశంగా మారింది. అది కూడా సిబిఎస్ఇ సెలబస్‌లో. ఢిల్లీలోని ఓ పాఠశాలలోని ఎన్వినాన్మెంట్ స్టడీస్ లో 'రోవింగ్ ఫ్యామిలీస్, షిప్టింగ్ హోమ్స్' అనే పాఠాశ్యంలో ప్రియాంక జీవిత చరిత్రను చేర్చారు.

    ఈ పాఠ్యాంశం పెట్టడానికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది. ప్రియాంక తండ్రి ఆర్మీ మేజర్. తండ్రి ఉద్యోగ రీత్యా వారి కుటుంబం కూడా వివిధ ప్రాంతాలకు మారడం జరిగింది. ప్రియాంక సక్సెస్ స్టోరీ, ఆర్మీ బ్యాగ్రౌండ్ నేపథ్యాన్ని తీసుకున్ని ఈ పాఠ్యాంశాన్ని రూపొందించారు. తన జీవితం పాఠ్యాంశంగా రావడంపై ప్రియాంక సైతం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

    అయితే సినిమా హీరోయిన్ల జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చడంపై విమర్శలు సైతం వెల్లువెత్తున్నాయి. ప్రింయాక సమాజానికి ఉపయోగపడే పనులేమీ చేయలేదు, ఎలాంటి సేవా కార్యక్రమాల్లో ఆమె పాల్గొనలేదు. ఎంతో మంది గొప్పవారు ఉంగా ఆమెను ఆదర్శవంతురాలిగా పాఠ్యాంశంలో చూపించడం ఏమిటని కొందరు అంటున్నారు.

    అయితే మరికొందరు మాత్రం....ప్రియాంకకు మద్దతు పలుకుతున్నారు. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుని దేశ కీర్తిని ప్రపంచానికి చాటిందని, కెరీర్ పరంగా చిన్నవయసులోనే సక్సెస్ ఫుల్ ఉమన్ గా ఎదిగిందని, అలాంటి వ్యక్తి జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చడంలో తప్పేమీ లేదు అని అంటున్నారు.

    English summary
    Priyanka Chopra's success story and army background has been featured in Springdale's School book. Her chapter in the Environmental Studies class has been aptly titled 'Roving Families, Shifting Homes', where in her growing up years has been covered.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X