For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ సెక్సీ : రామ్ చరణ్ హీరోయిన్ ఫొటో షూట్ (ఫొటోలు)

  By Srikanya
  |

  ముంబై : ఈ వయస్సులో ప్రియాంక చోప్రా ఇంత హాట్ గా ఉంటుందా...నిజం నమ్మండి అంటున్నాయి ఈ లేటెస్ట్ ఫొటో షూట్ ఫొటోలు. ఆమెలోని సెక్సీ కోషియంట్ ని పట్టుకుని ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ ఫిబ్రవరి సంచిక కోసం ప్రత్యేకంగా ఫొటో షూట్ చేసి వదిలారు. ఒక్కసారిగా ఈ ఫొటో షూట్ తో మరోసారి అందరి దృష్టీనీ ఆకర్షించిందీమె.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  రామ్ చరణ్ సరసన తుఫాన్ చిత్రంలో చేసిన ప్రియాంక చోప్రా తెలుగువారికి సుపరిచితమే. ఆమె పింక్ కలర్ హార్డ్లీ డేవిడ్ సన్ భైక్ లో ప్రక్కన నుంచుని ఇలా ఫొటో షూట్ చేసుకుని రసిక హృదయలకు కిక్కిస్తోంది. దానికి తోడు ఆిమె వేసిన బ్లాక్ డ్రస్, షార్ట్స్ మరింత శోభనిచ్చాయి.

  మరో ప్రక్క కలర్ ఫుల్ జాకెట్ తో, హై హై హీల్స్ తో తన తోటి హీరోయిన్స్ కు సవాల్ విసురుతోంది. వయస్సుతో పాటు అందం పెరుగుతోందని ప్రూవ్ చేస్తోంది. తనతో ప్రవేశించిన వారంతా ఫేడవుట్ అయినా తాను మాత్రం ఇంకా లైమ్ లైట్ లోనే ఉండటం కాకుండా ఇంత ఫిట్ గా ఉండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

  అదిరేటి అందం.. అలరించే అభినయం. కాసులు కురిపించే పాత్రలకీమనసులు కదిలించే నటనకీ సమ ప్రాధాన్యమిచ్చే తత్వం. స్వీటు ట్వీట్‌లతో యువతను గిలిగింతలు పెట్టే చిలిపిదనం. ఐరాస ప్రచారకర్తగా సదా సేవకు సిద్ధమనే వ్యక్తిత్వం. 'ఫ్యాషన్‌'తో జాతీయ ఉత్తమనటిగా మెరిసి..ఆటిజం అమ్మాయిగా అద్భుత నటనతో 'బర్ఫీ'ని భేష్‌ అనిపించిన ప్రియాంక చోప్రా అంతరంగం ఆమె మాటల్లోనే.

  ఫొటో షూట్ ఫొటోలు స్లైడ్ షోలో ..

  ఫ్యామిలీ..

  ఫ్యామిలీ..

  మా నాన్న పంజాబీ, అమ్మ బీహారీ. నేను పుట్టింది జార్ఖండ్‌లో. పెరిగింది ఎక్కడంటే ఏం చెప్పను! ఒక్కచోటని కాదు.. లక్నో, రాయ్‌బరేలీ, అమెరికా, ముంబయి.. ఇలా చదువు కోసం దేశవిదేశాల్లో తిరిగాను.

  నిజమే...

  నిజమే...

  నాన్న సైన్యంలో వైద్యుడిగా సేవలందించారు. ఆయన ఉద్యోగరీత్యా చాలా చోట్ల తిరిగి చదువుకోవాల్సి వచ్చింది. అమ్మాయిలకి నాన్నంటే అభిమానం ఎక్కువంటారు కదా! ఇది నా విషయంలోనూ నిజమే.

  తెగ బాధపడేదాన్ని

  తెగ బాధపడేదాన్ని

  చిన్నప్పుడు నేను ఆస్తమాతో తెగ బాధపడేదాన్ని. దాంతో నాన్న నిరంతరం నన్ను కనిపెట్టుకొని ఉండేవారు. అలా ఆయనే లోకంగా పెరిగాను. అలాగని గారాబం డాట్‌కామ్‌ అనుకునేరు. నన్నూ తమ్ముణ్నీ కఠిన క్రమశిక్షణతోనే పెంచారు.

  అప్పుడేమో..

  అప్పుడేమో..

  అమెరికాలో బంధువులింట్లో ఉండి చదువుకొన్నప్పుడు ఖర్చులకు వారానికి పది డాలర్లు ఇచ్చే వారు. అది ఏ మూలకూ సరిపోయేది కాదు. కొత్త ఫ్యాషన్లు కంటపడేవి. కానీ వాటి జోలికి వెళ్లే పరిస్థితి ఉండేది కాదు.

  కొనుక్కునేదాన్ని

  కొనుక్కునేదాన్ని

  ఒళ్లంతా మునిగిపోయినట్టుండే పెద్ద టీషర్టు, వదులుగా కనిపించే బ్యాగీ జీన్స్‌.. ఇలా కళాశాలకు వెళ్లేదాన్ని. నాకేమో చిరుగుల జీన్స్‌ కొనుక్కోవాలని కల. దాన్ని ఎలా తీర్చుకోవాలి? బయట చిరుతిళ్లు కొనడం తగ్గించుకొని, పాకెట్‌మనీలో మిగుల్చుకుని కోరుకున్న జీన్స్‌ కొనుక్కొనేదాన్ని.

  నాలో నేను...

  నాలో నేను...

  స్కూలు రోజుల నుంచీ నేను కాస్త సిగ్గరిననే చెప్పాలి. అంటే నాలో నేను తరహా. మరీ బాధ కలిగితే ఎవరూ చూడకుండా ఏడ్చేదాన్ని. ఇంకా బాధనిపిస్తే మనసు లోతులని వెతుకుతూ కవిత్వం రాసేదాన్ని. చిన్న కథలూ కవితలూ చాలానే రాశాను. కానీ పోటీలకు పంపలేదు. ఎవరికీ చదివి వినిపించలేదు.

  అప్పుడూ ఇప్పుడూ ...

  అప్పుడూ ఇప్పుడూ ...

  చిన్న చిన్న ఆనందాలతో సేదతీరడం, ఉత్సాహం పొందడం నాకలవాటే. జోరున వర్షం కురుస్తుంటే టెర్రస్‌ మీదకెళ్లి ఆనందిస్తాను. స్వర్గం ఏడిస్తే ఇలా వానలా పడుతుందని నా ఆలోచన. కిటికీ దగ్గర కూర్చుని కప్పు కాఫీతో కురిసే వర్షాన్ని ఆనందించడమంటే ఇంకా ఇష్టం. 'టప్‌ టప్‌ బర్‌సాతే..' గీతం నాకెంతో ఇష్టమైనది. ప్రముఖుల జీవిత చరిత్రలు చదవడం, ఉపయోగపడే అంశాలను ఆచరణలోకి తెచ్చుకోవడం చేస్తుంటాను.

  English summary
  Priyanka Chopra is surely one of the hottest actresses in Bollywood, and the actress showed off her sexiness quotient in the Februrary issue. It's surely Priyanka's attitude and her ability to carry off almost any outfit with confidence and sex appeal is what makes the latest photo shoot for Filmfare a hot one!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X