For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సల్మాన్ కే సవాల్ విసిరిన బుజ్జి మేనల్లుడు (వైరల్ వీడియో)

  By Srikanya
  |

  ముంబై: సల్మాన్ ఖాన్‌కు మొదటి నుంచీ పిల్లలంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే. అందుకే తన అన్నదమ్ముల పిల్లలను బాగా చూసుకుంటారు. చిన్నపిల్లలతో చాలా తొందరగా కలిసిపోయి ఆటలాడుతుంటాడు కూడా. తను ఆడించడానికి పిల్లల్లేకపోవడంతో, ఇప్పుడు మేనల్లుడిని తన మీద ఎక్కించుకుని ఆడించడానికి ఎదురుచూస్తున్నాడు సల్మాన్.

  కొద్ది నెలలు క్రితం సల్మాన్ ముద్దుల చెల్లి అర్పితా ఖాన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ బుడ్డాడికి అహిల్ అని పేరు పెట్టారు. మేనల్లుడుతో ఆటలాడుతూ, సల్మాన్ ఇలా మురిసిపోయారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

  ఇది ప్రక్కన పెడితే.. ఏడేళ్ల చిన్నారి విషయంలో సల్మాన్ చేసిన సాయం సైతం అంతటా వార్తల్లో నిలిచింది. సాహిల్‌ అనే ఏడేళ్ల చిన్నారి క్రౌజోన్‌ సిండ్రోం అనే అరుదైన వైకల్యంతో నరకయాతన అనుభవిస్తోంది. ఈ లోపం కారణంగా ఆ బాలిక కళ్లు బాగా వాచిపోయి తల, ముఖం ఆకారాన్ని మార్చేస్తాయి. ఇవి బాలిక పుర్రె ఎముకలను అసాధారణంగా మార్చేస్తాయి. దీనికి తోడు ఆ బాలిక అందిరిలాగా బయటకు రాలేదు.

  Mamu & Ahil Being Sultan @beingsalmankhan @aaysharma

  A video posted by Arpita Khan Sharma (@arpitakhansharma) on

  సూర్యకాంతి పడితే ఆమె కళ్లలో తీవ్రమైన నొప్పి వస్తుంది. బాలిక పరిస్థితి చూడలేక ఆమె తల్లిదండ్రులు పలు ఆసుపత్రులను సంప్రదించారు. కానీ అక్కడ ఫీజులు చెల్లించలేక మౌనంగా ఉండిపోయారు. ఈ విషయం సల్మాన్‌ దృష్టికి వచ్చింది.

  వెంటనే బాలిక పరిస్థితి తెలుసుకుని చలించిపోయాడు. బాలిక చికిత్సకు అయ్యే మొత్తం 'బీయీంగ్‌ హ్యూమన్‌' ఫౌండేషన్‌ ద్వారా భరిస్తానని మాట ఇచ్చాడు. దీంతో జులై13న బెంగళూరులో సాహిల్‌కు ఆపరేషన్‌ నిర్వహించడానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. వైద్యం ఖర్చు మొత్తం సల్మాన్‌ వ్యక్తిగతంగా చెల్లిస్తున్నాడు.

  Was lovely to meet u and Ahil yest @arpitakhansharma .. He's too much fun... C u soon in nyc..

  A photo posted by Priyanka Chopra (@priyankachopra) on

  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం సుల్తాన్. ఈ మూవీ టీజర్ మంగళవారం విడుదలైంది. సుల్తాన్ అలీ ఖాన్ అనే మల్లయోధుని పాత్రలో సల్మాన్ నటిస్తున్నారు. సల్లూభాయ్‌కు జోడిగా అనుష్క శర్మ నటిస్తుంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిలింస్ సుల్తాన్‌ను భారీగా నిర్మిస్తుంది. ఈ మూవీ రంజాన్ కానుకగా జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  English summary
  Ahil was also seen spending some super amazing time his Superstar Maamu Salman Khan. Arpita posted an adorable video of Ahil playing with Salman Khan. In the below video, one can see Salman singing the title track of his upcoming film, Sultan to Ahil and the duo can be seen indulging in some cute punching game. I am sure you don't wanna miss this sight. So here we go..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X