»   » పవన్ తమిళ రీమేక్...అసలు నిజం ఇదీ

పవన్ తమిళ రీమేక్...అసలు నిజం ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ త్వరలో వేదాలం అనే తమిళ రీమేక్ లో నటించనున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ చిత్రానికి ఎన్టీఆర్ తో రభస చిత్రం చేసిన సంతోష్ శ్రీనివాస్ డైరక్టర్ అని కూడా మీడియాలో గుప్పుమంది.

అయితే ఆ వార్తలో ఎంతవరకూ నిజానిజాలు ఎంతవరకూ ఉన్నాయనేది చర్చనీయాంసంగా మారాయి. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత ఎ.ఎమ్ రత్నం అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసారు. ఆయన రీసెంట్ గా ఓ తమిళ టాబ్లాయిడ్ తో మాట్లాడుతూ ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు..ఆయనేం అన్నారో ఆయన మాటల్లోనే చూడండి.

producer A.M Ratnam about pawan's remake

నిర్మాత ఎ.ఎమ్ రత్నం మాట్లాడుతూ.... కొద్దిరోజుల క్రితం...పవన్ ని కలిసాం. తమిళ హిట్ వేదాలం ను రీమేక్ ని ఖరారు చేసుకున్నాం. అయితే దర్శకుడుగా ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు. ఇప్పటివరకూ ఎవరు డైరక్ట్ చేస్తారనే ఆలోచనే లేదు. త్వరలోనే ఫైనలైజ్ చేసి ఎనౌన్స్ చేస్తాం అని తేల్చి చెప్పారు.

పవన్ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ విషయానికి వస్తే...

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ చిత్రానికి కెఎస్.రవీంద్ర (బాబీ)దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో పవన్ నటించి ‘గబ్బర్ సింగ్' భారీ విజయం సాధించడంతో మరోసారి ఆయన పోలీస్ గా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ రతన్‌పూర్ పోలీసుగా కనిపించబోతున్నారు.

producer A.M Ratnam about pawan's remake

సంఘవిద్రోహ శక్తులకు, అవినీతి పరులకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రతన్ పూర్ అంటే సామాన్యులతో పాటు పోలీసులు సైతం భయపడిపోతుంటారు. అలాంటి ఊర్లో పోలీసు ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఏం చేసాడు? వారిని ఎలా ఎదుర్కొన్నాడు? అనేది సినిమా కథ.

ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శరత్‌మరార్, సునీల్ లుల్లా సంయుక్తంగా నిరిస్తున్నారు. తొలిసారిగా కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు.

English summary
Speaking with a Tamil daily, producer AM Rathnam confirmed that he met Pawan Kalyan couple of days back and confirmed that Tamil hit "Vedhalam" is likely to be remade with him.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu