Just In
- 1 hr ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 1 hr ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 3 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 3 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- Finance
మార్కెట్ మహా పతనం, ఒక్కరోజులో ఇన్వెస్టర్ల సంపద రూ.5 లక్షల కోట్లు మటాష్
- Sports
India vs England: 'ఆతిథ్య జట్టు అవకాశాలు తీసుకుంటుంది.. మోడీ స్టేడియాన్ని నిషేధించాలి'
- News
'కుట్ర'కు కారణమదే.. జేసీని టార్గెట్ చేసిన తరహాలో స్కెచ్.. ఆ ఇద్దరిపై రఘురామ ఎటాక్,జగన్‌కూ హెచ్చరిక...
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి.. సినీ ప్రముఖుల సంతాపం
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖుల మరణాలు, షాకింగ్ ఘటనలు సినీ వర్గాలను కలవరపెడుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీన ప్రముఖ నిర్మాత ఆలపాటి రంగారావు కన్నుమూశారు. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని రోజులుగా అనారోగ్యం.. స్వగృహంలో కన్నుమూత
శ్రీనాథ్ మూవీస్, శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ మరియు కమల్ కాన్‌ప్రో ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయిన ఆలపాటి రంగారావు.. బుధవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు మరణించారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గుజరాత్ కచ్ జిల్లా ఆరిపూర్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు.

శోభన్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో..
70వ దశకంలో పలు సినిమాలు నిర్మించారు ఆలపాటి రంగారావు. శోభన్ బాబు లాంటి సూపర్ స్టార్‌తో కూడా సినిమాలు చేసిన ఆయన ఎన్నో విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం రంగారావు వయస్సు 88 సంవత్సరాలు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

నిర్మాతగా ఆలపాటి రంగారావు
శ్రీనాథ్ మూవీస్, శ్రీనాథ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రతీకారము, కాయ్ రాజా కాయ్, రాజ్ కుమార్, న్యాయనికి శిక్ష, చిన్నారి స్నేహం, మా తెలుగుతల్లి, నాకు పెళ్లం కావాలి, దోస్తి దుష్మన్ లాంటి చిత్రాలు నిర్మించిన ఆలపాటి రంగారావు నిర్మాతగా మంచి పేరు గడించారు.

సినీ ప్రముఖుల సంతాపం
ఆలపాటి రంగారావు మరణ వార్త తెలిసి టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులు తమ తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఒక మంచి మనిషిని కోల్పోయామని అంటూ ఆవేదన చెందుతున్నారు.