twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పులు చేసి చిక్కుల్లో పడ్డ నిర్మాత ఏఎం రత్నం

    By Bojja Kumar
    |

    AM Ratnam
    చెన్నై: శంకర్ లాంటి పెద్ద దర్శకులతో భారీ బడ్జెట్ చిత్రాలు, టాప్ స్టార్లతో హిట్ చిత్రాలు, కర్తవ్యం, స్నేహం కోసం, భారతీయుడు, ఖుషి, బాయ్స్, 7జి బృందావన్ కాలనీ లాంటి చిత్రాలతో సౌతిండియా సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా వెలుగొందిన నిర్మాత ఏఎం రత్నం ఆ తర్వాత నష్టాల బాట పట్టారు.

    నష్టాల, అప్పుల కారణంగా గత నాలుగైదేళ్లుగా ఆయన సినిమాలేవీ నిర్మించడం లేదు. తాజాగా అప్పు ఇచ్చిన వాళ్లు ఆయన్ను కోర్టు కీడ్చారు. చెన్నైకి చెందిన ఫిల్మ్ ఫైనాన్సియర్ కృష్ణన్ ఏఎం.రత్నంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఏఎం రత్నం తమకు ఇవ్వాల్సిన డబ్బు తిరిగి ఇవ్వడంలో విఫలం అయ్యాడని కోర్టులో పిటీషన్ దాఖలు చేసాడు.

    కృష్ణన్ చెప్పిన వివరాల ప్రకారం 'కాలన్' అనే చిత్రం కోసం తన తల్లి వద్ద నుంచి రూ. 1.5 కోట్లు తీసుకున్నాడని, సినిమా విడుదల(జనవరి 2006) ముందే సంవత్సరానికి 18 శాతం వడ్డీతో తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడని, కానీ అసలు చెల్లించి వడ్డీ ఎగ్గొట్టాడని తెలిపారు.

    ఆ తర్వాత సర్దుబాటులో భాగంగా రత్నం, సదరు ఫైనాన్సియర్ మరో సినిమా కోసం సరికొత్త అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. సంవత్సరానికి 36 శాతం వడ్డీతో గడువులోపు డబ్బు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. రత్నం ఇప్పుడు సదరు నిర్మాతకు రూ. 4.60 కోట్లు బాకీ పడ్డాడట. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెలుతుందో చూడాలి.

    English summary
    Producer AM Ratnam in trouble. Chennai based film financier Krishnan has moved the Madras High court, alleging that AM Ratnam has failed to return his money.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X