»   » ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నాయకుడు పవన్ కళ్యాణే...

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నాయకుడు పవన్ కళ్యాణే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ నాయకుడు పవన్ కళ్యాణే అని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్ వ్యాఖ్యానించారు. మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసారు.

అశ్వినీదత్ ప్రముఖ తెలుగు నిర్మాతల్లో ఒకరు. వైజయంతి మూవీస్ బేనర్లో ఆయన అనేక భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించారు. తెలుగులో భారీ విజయం సాధించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'చూడాలని ఉంది', 'ఇంద్ర' లాంటి భారీ చిత్రాలు నిర్మించారు.

Producer Ashwini Dutt visits Tirumala

మెగా ఫ్యామిలీతో అశ్వినీదత్‌కు మంచి అనుబంధం ఉంది. పవన్ కళ్యాణ్‌తో ఆయన 2004లో 'బాలు' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఆ చిత్రం ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. రామ్ చరణ్ తేజ్ తెరంగ్రేటం చేసిన 'చిరుత' చిత్రం కూడా వైజయంతి మూవీస్ బేనర్లో నిర్మించినదే.

వైజయంతి మూవీస్ బేనర్లో భారీ హిట్ చిత్రాలు మాత్రమే కాదు...భారీ ప్లాపు చిత్రాలు కూడా వచ్చాయి. ఈ బేనర్లో వచ్చిన 'శక్తి', 'సైనికుడు', 'సుభాష్ చంద్రబోస్' లాంటి చిత్రాలు తీవ్రమైన నష్టాలను మిగిల్చాయి. శక్తి సినిమా తర్వాత వైజయంతి మూవీస్ బేనర్లో సినిమాలేవీ రాలేదు.

English summary
Tollywood Producer Ashwini Dutt visited Tirumala today. Vyjayanthi Movies is an Indian Film production company established in 1974, by C. Ashwini Dutt. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu