»   » మౌనం వీడిన బండ్ల గణేష్: పవన్, ఎన్టీఆర్, బినామీ.... ఇంకా ఎన్నో చెప్పాడు!

మౌనం వీడిన బండ్ల గణేష్: పవన్, ఎన్టీఆర్, బినామీ.... ఇంకా ఎన్నో చెప్పాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆఫీసు బాయ్ గా ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్లతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే స్థాయికి వచ్చిన నిర్మాత బండ్ల గణేష్ మీద ఎన్నో రూమర్స్, మరెన్నో అనుమానాలు. ఆయన ఓ రాజకీయ నేతకు బినామీ అనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.

ఈ మధ్య బండ్ల గణేష్ ఉన్నట్టుండి సినిమాలకు దూరం అయ్యారు. ఇన్ కం టాక్స్ దెబ్బకే బండ్ల గణేష్ దుకాణం సర్దేశాడని.... ఆయన్ను బినామీగా పెట్టుకున్న నేతలు ఎన్నికల్లో ఓడి పోవడం వల్లే గణేష్ వద్ద డబ్బు లేకుండా అయిందనే ప్రచారం కూడా జరిగింది.

ఇంకా బండ్ల గణేష్ చుట్టూ ఎన్నో వివాదాలు, ఎన్నో అంతు పట్టని విషయాలు. విటన్నింటిపై ఇంతకాలం మౌనంగా ఉన్న బండ్ల గణేష్ ఇటీవల ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో మౌనం వీడియారు. అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

సినిమాలకు దూరం కావడానికి కారణం

సినిమాలకు దూరం కావడానికి కారణం

డబ్బు లేకనే సినిమాలకు దూరం అయ్యాను అనడంలో నిజం లేదు. మంచి సినిమాలు తీయాలని కొంతకాలం గ్యాప్‌ తీసుకున్నాను. ఇప్పుడు వరుసగా ఐదు సినిమాలు ప్లాన్‌ చేస్తున్నాను. సినిమా తీయాలంటే డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద హీరోల డేట్సే సినిమాకు డబ్బులు. సినిమా తీయడం ఒక కళ. డబ్బులున్నొళ్లందరూ సినిమాలు తీయలేరు అని గణేష్ తెలిపారు.

నాపై తప్పుగా ప్రచారం జరిగింది

నాపై తప్పుగా ప్రచారం జరిగింది

నేను ఆఫీస్ బాయ్ గా కెరీర్ మొదలు పెట్టాను అనే విషయంలో ఎంత మాత్రం నిజం లేదు. కె.ఎస్‌ రామారావుగారి దగ్గర మేనేజర్‌గా నేను ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టాను అని బండ్ల గణేష్ ఓచెప్పుకొచ్చారు.

మరీ అంత దీన స్థితి కాదు

మరీ అంత దీన స్థితి కాదు

నేను ఆఫీస్ బాయ్‌గా చేసే దీనమైన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఎందుకంటే ముందు నుంచి పౌల్ట్రీ రంగంలో బాగా స్థిరపడి కుటుంబం మాది. సినిమా మీద పిచ్చితో ఇటువైపు వచ్చాను. మధు పిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. కెఎస్ రామారావు దగ్గర మేనేజర్ గా నేను కెరీర్ మొదలు పెట్టాను అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ తో పరిచయం

పవన్ కళ్యాణ్ తో పరిచయం

సుస్వాగతం సినిమా సమయంలో పవన్‌కళ్యాణ్‌ గారితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత కొమరం పులి సమయంలో సినిమా తీస్తావా గణేష్‌ అని ఆయనే అడిగారు. ఆ సమయంలో షాద్‌నగర్‌లో మా కోళ్ల పరిశ్రమలో లాభాలు వచ్చాయి. చేతిలో డబ్బు ఉండటంతో నిర్మాతగా మారాను అన్నారు గణేష్.

బొత్సా సత్సనారాయణకు బినామీ అనే రూమర్లపై

బొత్సా సత్సనారాయణకు బినామీ అనే రూమర్లపై

నేను ఎవ్వరికీ బినామీ కాను. రోజూ ఆయన దగ్గరకు వెళ్లే వాణ్ణి. అదే సమయంలో సినిమాలు మొదలుపెట్టడంతో ఆయనకు బినామీ అని పేరొచ్చింది. అది తెలిశాక ఆయన దగ్గరకు వెళ్లడం మానేసాను. కానీ పేరు మాత్రం పోలేదు.... బండ్ల గణేష్ స్పష్టం చేసారు.

ఆయన నాకు దేవుడు

ఆయన నాకు దేవుడు

పవన్ కళ్యాన్ నాకు లైఫ్ ఇచ్చాడు. నాకు దేవుడు. ఆయనతో తీసిన తొలి సినిమా నష్టపోతే మళ్లీ నా కోసం సినిమా చేసాడు. పవన్ కళ్యాణ్ తో మళ్లీ సినిమాలు చేయకపోవడానికి ప్రత్యేకంగా కారణం ఏమీ లేదు. ఆయనతో సినిమాలు చేయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. శరత్ మరార్ 20 ఏళ్ల నుండి ఆయనతో ఉంటే ఇప్పుడు అవకావం వచ్చింది అని గణేష్ తెలిపారు.

2019లో వార్ వన్ సైడే

2019లో వార్ వన్ సైడే

పవన్ కళ్యాణ్ లో 200 శాతం రాజకీయ నాయకుడు ఉన్నాడు. యాక్టర్‌ కన్నా రాజకీయ నేతనే ఎక్కువ కనిపిస్తాడు. 2019లో చూడండి వార్‌ వన్‌సైడ్‌ అవుతుంది. ఆయన సీటిస్తే పోటీ చేస్తా. గెలుస్తా. ఎంపీ కావాలనుంది, దానికంటే ముందు ఆయన గెలుపు చూడాలని ఉంది అని బండ్ల గణేష్ తెలిపారు.

 నష్టపోయిన సినిమాలు, లాభాలు తెచ్చిన మూవీస్

నష్టపోయిన సినిమాలు, లాభాలు తెచ్చిన మూవీస్

నేను ఇప్పటి వరకు 8 సినిమాలు చేసారు. ఒక్క బాద్ షాలోనే నష్టం వచ్చింది. సినిమా హిట్టే కానీ ఆ రోజుల్లో 60 కోట్లు అయింది. ప్రొడక్షన్ కాస్ట్ బాగా పెరగడం వల్ల ఇలా జరిగింది. సినిమా అమ్మితే 54 కోట్లే వచ్చింది. 6 కోట్లు నష్టపోయాను. గబ్బర్‌సింగ్‌, టెంపర్‌లో మంచి లాభాలొచ్చాయని తెలిపారు.

ఎన్టీఆర్ తో విబేధాలు

ఎన్టీఆర్ తో విబేధాలు

జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఎలాంటి విబేధాలు లేవు. ఎవరో చెప్పుడు మాటలు విని మనస్పర్థలు వచ్చాయి. తరువాత తెలుసుకుని మీరే కరెక్ట్‌ అని చెప్పాను. అభిమానులకు క్షమాపణ చెప్పాను అని గణేష్ తెలిపారు.

లక్ష్యాలు

లక్ష్యాలు

నాకు లక్ష్యాల్లో ఒకటి ఫ్యామిలీని బాగా సెటిల్ చేయడం, ఎప్పటికైనా చిరంజీవితో సినిమా తీయడం అనేది నా లక్ష్యాలు అని గణేష్ చెప్పుకొచ్చారు.

English summary
Producer Bandla Ganesh said Pawan Kalyan has a special effect on his career. In a popular program of 'Open Heart With RK', the producer said some interesting details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu