»   » పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ, ఆ నిర్మాత ఫైనాన్షియల్ సపోర్ట్?

పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ, ఆ నిర్మాత ఫైనాన్షియల్ సపోర్ట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన విశేషాల్లోకి వెళితే....తెర వెనక పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారం వెనక ఓ బడా సినిమా నిర్మాత పేరు వినిపిస్తోంది.

ప్రస్తుతం రాజకీయాలంటే ఆశామాషీ వ్యవహారం కాదు. ప్రెస్ మీట్ దగ్గర నుండి, బహిరంగ సభలు, ప్రచార కార్యక్రమాలు ఇలా ఏం చేయాలన్నా......డబ్బు నీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. అలా అని పవన్ కళ్యాణ్ పార్టీ డబ్బు పార్టీ అని మాత్రం అపార్థం చేసుకోవద్దు. పవన్ కళ్యాణ్ మంచోడే కానీ.....ఆయన మంచోడని ఏవీ ఫ్రీగా రావుకదా. కొన్ని ఖర్చులు అనివార్యం.

Producer behind Pawan Kalyan's political entry?

పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల వెనక ప్రముఖ 'పివిపి సినిమా' సంస్థ అధినే ప్రసాద్ వి. పొట్లూరి మద్దతుగా ఉంటున్నారని టాక్. పవన్ పార్టీ తరుపున ఆయన భవిష్యత్తులో విజయవాడ నుండి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆయన పవన్ పార్టీ రాజకీయ కార్యక్రమాలకు ఫైనాన్సియల్‌గా సపోర్టుగా నిలుస్తారని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఈ మార్చి 9న గానీ, మార్చి 14వ తేదీనగానీ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైందనే విషయాన్ని ధ్రువీకరిస్తూ హైదరాబాదులోని హైటెక్స్‌లో పవన్ కళ్యాణ్ పేర ఓ హాల్ బుక్కయినట్లు సమాచారం. హైటెక్స్ వేదికగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం పవన్ కళ్యాణ్ తాను స్థాపించబోయే పార్టీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ అనుచరులతో పాటు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్త హాజరవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల పాటు ఆయన ప్రసంగించే అవకాశాలున్నాయి. ఆ తర్వాత తాను రాజకీయాలపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రానికి సోదరుడు, సినీ నటుడు నాగబాబు మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. తెర వెనక వ్యహారమంతా సినీ దర్శకుడు త్రివిక్రమ్ చూస్తున్నట్లు వినికిడి. గతంలో పరుచూరి బ్రదర్స్, త్రిపురనేని మహారథి ఇటువంటి పనులు చేసేవారు. అదిరిపోయే, పంచ్ పొలిటికల్ డైలాగులు తయారు చేసి పెట్టేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు త్రివిక్రమ్ ఆ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
According to grapevine, noted industrialist Prasad V Potluri who was supposed to foray into politics from YSR Congress is now aiding Pawan’s new party. Buzz also has it that PVP may contest from Vijayawada on Pawan’s political banner. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu