»   » త్రివిక్రమ్‌ కొడుకులా కాపాడారు

త్రివిక్రమ్‌ కొడుకులా కాపాడారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అదో పెద్ద షాక్‌. అది చేసిందీ నా ఉద్యోగి కావడం నన్ను మరింత భయపెట్టింది. ఇన్నాళ్లూ ఒక పామును పక్కన పెట్టుకుని నిద్రపోయానా అనుకుని వణికిపోయాను. ఆ సమయంలో తివిక్రమ్‌ నన్ను ఒక కొడుకులా కాపాడారు. నా ఆరోగ్య పరిస్థితి తెలిసి చాలా జాగ్రత్తలు పాటించారు అంటూ చెప్పుకొచ్చారు ప్రముఖ నిర్మాత బి.వియస్ ఎన్ ప్రసాద్. ఆయన గత సంవత్సరం విడుదలై విజయవంతం అయిన అత్తారింటికి దారేది చిత్రం పైరసీ విషయం గుర్తు చేసుకుంటూ ఇలా చెప్పుకొచ్చారు.

అలాగే 'అత్తారింటికి దారేది' రిలీజు కాకుండానే పైరసీ సినిమా నెట్లో వచ్చేసింది. కేవలం సగం సినిమా మాత్రమే పైరసీ చేశారనేది అబద్ధం. మొత్తం సినిమా బయటకొచ్చేసిందిముందుగా పైరసీ విషయం చెప్పకుండా సెప్టెంబరు 27న విడుదల చేద్దామని చెప్పారు. తరువాత మెల్లగా చెప్పారు. అప్పటికప్పుడు ఆరేడు బృందాలను ఏర్పాటు చేసి కనిపించిన ప్రతి వెబ్‌సైట్‌ నుంచీ సినిమా తొలగించాం. ఆ సమయంలో పవన్‌కల్యాణ్‌ త్రివిక్రమ్‌, మా అబ్బాయి బాపినీడు, పోలీసులూ నాకు అందించిన సహకారం మరచిపోలేనిది అన్నారు.

Producer BVSN Prasad about Trivikram Srinivas

ఇక విజయా సంస్థకు గుండమ్మ కథ ఎలాంటి సంతృప్తి, గుర్తింపు ఇచ్చిందో దాదాపుగా అలాంటి సంతృప్తే నాకు 'అత్తారింటికి దారేది' సినిమాతో కలిగింది. జీవితంలో నేను మరచిపోలేని సినిమా కూడా అదే. కారణం నేను పడ్డ ఇబ్బందులే. సినిమా సూపర్‌హిట్‌ అయింది. ప్రేక్షకుడు థియేటర్లోనే సినిమా చూడాలనుకుంటాడు, అతణ్ణి అక్కడికి రప్పించే దమ్ము మన సినిమాలో ఉంటే పైరసీ ఏమీ చేయలేదని నా సినిమా నిరూపించింది అని సంతోషంగా చెప్పుకొచ్చారు.

పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
‘Atharintiki Daaredhi’ producer BVSN Prasad said that Trivikram Srinivas is just like his Son.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu