»   »  విషాదం: మూవీ మొఘల్ రామానాయుడు ఇకలేరు

విషాదం: మూవీ మొఘల్ రామానాయుడు ఇకలేరు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నిర్మాత, దాదా పాల్కే అవార్డు గ్రహీత డాక్టర్. దగ్గుబాటి రామానాయుడు(78) కన్నుమూసారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన బుధవారం కన్నుమూసారు. రామానాయుడు అనారోగ్యంతో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు.

Producer D Ramanaidu no more

రామానాయుడికి 13 ఏళ్ల క్రితం ప్రొస్టేట్ క్యాన్సర్ సోకినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆయన చికిత్స తీసుకున్నారు. అయితే కొన్ని నెలల క్రితం మళ్లీ సమస్య ఏర్పడిందని తెలుస్తోంది. ఇంగ్లీషు మందులతో శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుండటంతో హోమియో, ఆయుర్వేద చికిత్స చేయించినట్లు సమాచారం.

ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామానాయుడు ఇప్పటి వరకు 13 బాషల్లో 150 వరకు చిత్రాలు నిర్మించారు. ఆరుగురిని హీరోలుగా, 21 మందిని దర్శకులుగా, 12 మందిన హీరోయిన్లుగా పరిచయం చేసారు. వివిధ బాషల్లో అత్యధిక సినిమాలు నిర్మించిన నిర్మాతగా గిన్నిస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులైన దాదా సాహెబ్ ఫాల్కె, పద్మభూషణ్ తో సహా పలు అవార్డులతో సత్కరించింది.

రామానాయుడు మృతితో తెలుగు సిని పరిశ్రమ విషాదంలో మునిగి పోయింది. పలువురు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబుతో సహా పలువురు సంతాపం వ్యక్తం చేసారు.

English summary
Dada Saheb phalke awardee and Telugu Film producer D Ramanaidu passed away.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu