twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ నిర్మాత కన్నుమూత.. షాకింగ్‌లో అక్కినేని ఫ్యామిలీ

    |

    ప్రముఖ నిర్మాత డి.శివ‌ప్ర‌సాద్ రెడ్డి క‌న్నుమూత‌ ప్ర‌ముఖ నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి(62) శనివారం ఉద‌యం ఆరున్న‌ర గంట‌ల‌కు క‌న్నుమూశారు. హృద‌య సంబంధిత స‌మ‌స్య‌తో చెన్నైలోని అపోలో హాస్పిట‌ల్లో ఆయ‌నకు ఇటీవ‌ల ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ జ‌రిగింది. ఈయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు. ఆయన మృతికి టాలీవుడ్ చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

     1985లో కామాక్షి మూవీస్

    1985లో కామాక్షి మూవీస్

    1985లో కామాక్షి మూవీస్ బ్యాన‌ర్‌ను స్థాపించి కార్తీక పౌర్ణ‌మి చిత్రాన్ని రూపొందించారు. క్లాలిటీ, కుటుంబ చిత్రాలు రూపొందించడంలో నైతిక, సాంకేతిక విలువలను పాటించారు. సినీ పరిశ్రమకు అనేక మంది టెక్నిషియన్స్‌ను పరిచయం చేశారు

    పోసాని ‘ఆపరేషన్ వెర్రిపువ్వు' హాట్ టాపిక్... పవన్‌కు ముప్పు, ఎన్టీఆర్‌నూ తొక్కేస్తారట!పోసాని ‘ఆపరేషన్ వెర్రిపువ్వు' హాట్ టాపిక్... పవన్‌కు ముప్పు, ఎన్టీఆర్‌నూ తొక్కేస్తారట!

    రూపొందించిన చిత్రాలు

    రూపొందించిన చిత్రాలు

    1987లో శ్రావ‌ణ సంధ్య‌, విక్కీ దాదా నిర్మించారు. ఆ తర్వాత ముఠా మేస్త్రి, అల్ల‌రి అల్లుడు, ఆటోడ్రైవ‌ర్‌, సీతారామ‌రాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్‌, కింగ్, కేడీ, ర‌గ‌డ‌, ద‌ఢ‌, గ్రీకువీరుడు సినిమాల‌ను నిర్మించారు.

    ఈయ‌న మృతి ప‌ట్ల తెలుగు సినీ పరిశ్ర‌మ సంతాపాన్ని వ్య‌క్తం చేసింది.

    నాగార్జునతో అనుబంధం

    నాగార్జునతో అనుబంధం

    తొలుత శోభన్‌బాబుతో సినిమాలు రూపొందించిన శివప్రసాద్ రెడ్డి ఆ తర్వాత కేవలం నాగార్జున అక్కినేనితో ఎక్కువ చిత్రాలు రూపొందించారు. అక్కినేని నాగార్జునతో రూపొందించిన అల్లరి అల్లుడు, సీతారామరాజు, నేనున్నాను, కింగ్ చిత్రాలు ఘన విజయం సాధించాయి.

     సినిమాలకు దూరంగా

    సినిమాలకు దూరంగా

    శివప్రసాద్ రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడటమే కాకుండా ఆయన నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందటంతో సినీ నిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు. కింగ్ తర్వాత కేడీ, రగడ, దడ, గ్రీకు వీరుడు చిత్రాలు ఆశించినంత విజయాన్ని సాధించకపోవడంతో టాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. నాగార్జునతో రూపొందించిన గ్రీకు వీరుడు ఆయన చివరి చిత్రం.

    English summary
    Kamakshi Movies film production company established by D.Shiva Prasad Reddy, an Indian film producer. Kamakshi Movies was founded by D Siva Prasad Reddy in the year 1987. Ever since its inception, the production house has committed itself to making quality cinema. He lost his last breath on Octorber 27th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X