twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీనియర్ తెలుగు దర్శక, నిర్మాత మృతి

    By Srikanya
    |

    హైదరాబాద్: 'సంసారం', 'సంతానం', 'తోబుట్టువులు' లాంటి చిత్రాలు తీసిన నిర్మాత సి.వి.రంగనాథ్‌ దాస్‌. ఆయన బుధవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. వయసు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా దాస్‌ అస్వస్థతతో ఉన్నారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

    నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందిన ఆయన 'సంసారం' సినిమాతో నిర్మాతగా తెలుగు చిత్రీసీమకి పరిచయమయ్యారు. ఇందులో ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు హీరోలు. ఎల్వీ ప్రసాద్‌ దర్శకులు. అక్కినేనికి ఇదే తొలి సాంఘిక చిత్రం కావడం విశేషం. మహానటి అనిపించుకున్న సావిత్రి 'సంసారం'లో చిన్న పాత్రలో కనిపిస్తారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ తెలుగులో పాడిన తొలి గీతం 'నిదురపోరా తమ్ముడా'. ఇది దాస్‌ తీసిన 'సంతానం' సినిమాలోనిదే.

    తొలి ప్రయత్నం విజయవంతం కావడంతో దాస్‌ ఆ తరవాత దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ఎన్టీఆర్‌ నటించిన 'దాసి' చిత్రానికి దర్శకత్వం వహించారాయన. ఆపైన స్వీయ దర్శకత్వంలో 'సంతానం', 'తోబుట్టువులు', 'సంకల్పం' నిర్మించారు. అన్నీ విజయవంతమయ్యాయి. 'సంకల్పం' తరవాత ఆయన చిత్రసీమకు దూరమై ఇతర వ్యాపారాల్లో నిమగ్నమయ్యారు.

    ప్రసిద్ధ గాయనీమణి లతామంగేష్కర్‌తో తెలుగులో తొలి పాట పాడించిన ఘనత రంగనాథ్‌దాస్‌దే. 'సంతానం' సినిమా కోసం సుసర్ల దక్షిణామూర్తి స్వరకల్పన చేసిన 'నిదురపోరా తమ్ముడా..' పాటను ఆలపించారు లతా. అలాగే సావిత్రిని వెండితెరకు పరిచయం చేసినది కూడా రంగనాథ్‌దాస్. సాధన ప్రొడక్షన్స్ పతాకంపై తోబుట్టువులు, సంకల్పంలాంటి పలు చిత్రాలు నిర్మించారు. వాటిలో రజతోత్సవాలు జరుపుకున్న చిత్రాలు ఎక్కువ. 1960తోనే రంగనాథ్‌దాస్ సినీ జీవితం పూర్తయిందని చెప్పాలి. ఆ తర్వాత ఆయన చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

    English summary
    Telugu film director, producer C.V.Ranganath Das Died Wednesday night at Hyderabad. He directed Santhanam, Sankalpam, Thobuttuvulu etc.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X