Don't Miss!
- Finance
India imf: శభాష్ ఇండియా అంటూ IMF ప్రశంసలు.. ప్రపంచ ఆర్థికంలో మన వాటా ఎంతంటే..?
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ఖిలాడీ తగ్గేదేలే.. రిలీజ్ విషయంలో నిర్మాత క్లారిటీ.. జగన్ నుంచి అభయం!
రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ఖిలాడీ విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కావాల్సి ఉండగా ఆంధ్ర ప్రదేశ్ నైట్ కార్ఫ్యో కారణంగా మరో వారం వాయిదా వేయాల్సి రావచ్చని అన్నారు. అయితే అది నిజం కాదని తేల్చారు సినీ నిర్మాత. తాజా ఇంటర్వ్యూలో ఆయన మరిన్ని విషయాలు కూడా పంచుకున్నారు.

ఖిలాడిగా సందడి
మాస్ మహారాజా రవితేజ త్వరలో ఖిలాడిగా సందడి చేయనున్నాడు. డింపుల్ హయతి,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ కూడా ఉంది. క్రాక్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

గొడవలు జరిగాయని
దర్శకుడు రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అయితే నిజానికి ఖిలాడీ షూట్ అయిన తరువాత దర్శకుడికి హీరోకి పడడం లేదని, వారిద్దరి మధ్య గొడవలు జరిగాయని రకరకాల ప్రచారం జరిగింది.

వాయిదా వేయాలని
అంతేకాక సినిమా రిలీజ్ విషయంలో కూడా సినిమా టీమ్ రెండుగా చీలిపోయిందని వార్తలు వచ్చాయి . అంతే కాక రవితేజ మరో వారం రోజులు వేచి ఉండి, వారు 100% ఆక్యుపెన్సీ వచ్చి నైట్ కర్ఫ్యూ పోయిన తరువాత విడుదల చేయాలని భావిస్తున్నారని ప్రచారం జరిగింది.

లేఖ రాశా
తాజాగా ఈ విషయం మీద నిర్మాత కోనేరు సత్యనారాయణ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ విషయం మీద ఆయన స్పందించారు. పెండింగ్‌లో ఉన్న పనులన్నీ 11వ తేదీలోగా పూర్తి చేస్తారా అన్న సందేహం రవితేజకు ఉంది కానీ దర్శకుడు ఆ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే సినిమా రిలీజ్ కంటే ముందే అవుట్ ఫుట్ మాకు ఇచ్చేశారు. నేను కూడా రాత్రిపూట కర్ఫ్యూకి మరో గంట మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నేను ఇప్పుడే లేఖ రాశాను, తద్వారా మేము అన్ని షోలను ప్లాన్ చేసిన విధంగా ప్రదర్శించగలము, "అని ఆయన అన్నారు.
Recommended Video

హిందీలో కూడా
"ఫిబ్రవరి 25 వరకు మరో పెద్ద సినిమా ఏదీ లేకపోవడంతో మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంటే మాకు రెండు వారాలు ఫ్రీ రన్ ఉంటుంది. మొదటి 3-4 రోజులు ఎలాగూ బాగానే ఉంటాయి అలాగే ఫిబ్రవరి 15 నుంచి ఈ నైట్ కర్ఫ్యూ సహా 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు లాంటివి కూడా తొలగిపోతాయి. కాబట్టి, ఫిబ్రవరి 11 మంచి డేట్ అని మేము అనుకుంటున్నాం అని ఆయన అన్నారు. అలాగే హిందీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం'' అని నిర్మాత సత్యనారాయణ తెలిపారు. ఈ సినిమాను హిందీలో పెన్ సినిమాస్ సంస్థ విడుదల చేస్తోంది. హిందీ హక్కులు భారీ రేటు వెచ్చించి మరీ దక్కించుకుంది.