»   » ఆ హీరోయినా.. వద్దు బాబోయ్.. వణుకుతున్న సంఘమిత్ర నిర్మాత

ఆ హీరోయినా.. వద్దు బాబోయ్.. వణుకుతున్న సంఘమిత్ర నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ చిత్ర రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సంఘమిత్రను తెరకెక్కించే ప్రయత్నం జరుగుతున్నది. అయితే ప్రతిష్థాత్మకమైన ప్రాజెక్ట్‌కు ఆదిలోనే గండిపడింది. సంఘమిత్ర సినిమా నుంచి హిరోయిన్ శృతిహాసన్ అనూహ్యంగా తప్పుకోవడంతో ఆ ప్రాజెక్ట్‌కు ఎదురుదెబ్బ తగిలింది. సంఘమిత్ర టైటిల్ పాత్రను పోషించేదెవరు అనే ప్రశ్న మీడియాలో చర్చనీయాంశమైంది. పలువురు హీరోయిన్ల పేర్లను తాజాగా పరిశీలించారు. పరిశీలనకు వచ్చిన పేర్లలో అనుష్క, హన్సిక, నయనతార ఉన్నాయి. అయితే ఇంతవరకు వారిలో ఎవరి పేరు కూడా కన్ఫర్మ్ కాలేదు.

తెరపైకి హన్సిక పేరు

తెరపైకి హన్సిక పేరు

సంఘమిత్ర చిత్రానికి దర్శకత్వం వహించిన సుందర్‌కు హన్సిక అంటే చాలా అభిమానం. ఇప్పటికే మూడు చిత్రాల్లో అవకాశం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సంఘమిత్ర పాత్రకు హన్సికను తీసుకొంటే ఎలా ఉంటుంది అనే ప్రతిపాదనను దర్శకుడు నిర్మాతల ముందు ఉంచడం జరిగిందట. అయితే వ్యాపారంలో మెలికలు తిరిగిన సంఘమిత్ర చిత్ర నిర్మాత మురళి నటి హన్సిక ఆ పాత్రకు సరిపోదని స్పష్టం చేశారట.

ఆమెకు బిజినెస్ లేదు..

ఆమెకు బిజినెస్ లేదు..

ఇప్పటి వరకు హన్సిక ఎక్కువగా గ్లామర్ పాత్రలకే పరిమితమైంది. బరువైన పాత్రలు పోషించిన దాఖలాలు లేవు. అది పక్కన పెడితే... హన్సికకు తమిళంలోనే కాదు తెలుగులోనూ మార్కెట్‌లేదు. అలాంటి నటిని సంఘమిత్రలో నాయకిగా ఎంపిక చేస్తే సినిమా బిజినెస్ పూర్తిగా దెబ్బతింటుందని నిర్మాత అభిప్రాయపడ్డారట. దీంతో దర్శకుడు సుందర్‌ సీ సైలెంట్‌ అయ్యిపోయారట.

క్లిష్ణ పరిస్థితుల్లో హన్సిక

క్లిష్ణ పరిస్థితుల్లో హన్సిక

తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన హన్సికకు ఈ మధ్య టైమ్‌ అసలే బాగోలేదు. ఆమె పరిస్థితి ఎంత దారుణమంటే కోలీవుడ్‌లో ఒక్క చిత్రం లేదంటే నమ్మండి. ఏదేమైనా హన్సికను కోలీవుడ్‌ పూర్తిగా పక్కన పెట్టేసిందన్నది నిజం. తెలుగు చిత్ర పరిశ్రమలోను ఈ బ్యూటీ పరిస్థితి అలానే ఉంది. దర్శకుడు సుందర్ ప్రతిపాదనకు నిర్మాత అడ్డు చెప్పడం వల్ల సంఘమిత్ర లాటి పవర్‌పుల్ క్యారెక్టర్‌లో నటించే అవకాశాన్ని హన్సిక తృటిలో కోల్పోయింది.

అనుష్క, నయనతార..

అనుష్క, నయనతార..

కాగా సంఘమిత్రలో హీరోయిన్ పాత్ర కోసం అనుష్క, నయనతార పేరు పరిశీలనకు వచ్చినట్టు సమాచారం. నయనతార నటించిన తిరునాళ్, డోరా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కాగా సంఘమిత్ర పాత్ర కోసం బాలీవుడ్‌కు చెందిన ఓ అగ్రతారను నిర్మాతలు సంప్రదిస్తున్నట్టు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తున్నది.

తమన్నా పేరు వెలుగులోకి...

తమన్నా పేరు వెలుగులోకి...

కాగా, బాహుబలి ది బిగినింగ్ చిత్రంలో అవంతిక పాత్రను సునాయసంగా పోషించిన తమన్నా పేరు కూడా తాజాగా తెరమీదకు వచ్చింది. ఇప్పటికే బాహుబలి కోసం కత్తిసాము, గుర్రపు స్వారీ, తదితర యుద్ధ విద్యలలో ప్రావీణ్యం సంపాదించింది. మరోసారి వాటికి మెరుగుపెడితే మళ్లీ సంఘమిత్రగా అదృష్టాన్ని పరీక్షించుకొనే అవకాశం కూడా ఉంటుంది.

English summary
It is rumoured that Hansika, one of the most favourite actresses of actor-producer-director Sundar C is planned for replace Shruti Haasan. But Producer Murali of Sri Thenandal Films rejected Directors proposal. Now Anushka, Tamannaah names come into light.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X