twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వారే ఇండస్ట్రీని నాశనం చేశారు... స్పైడర్, అజ్ఞాతవాసి ప్లాపైతే అడగరేం, దమ్ముంటే పెద్ద సినిమాలు ఆపండి!

    By Bojja Kumar
    |

    తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ నడుస్తున్న నేపథ్యంలో నిర్మాత నట్టి కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సంచలన కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీ చరిత్రలో 6 రోజులు బంద్ అనేది ఏ రోజూ జరుగలేదు. ఈ బంద్ వల్ల కొన్ని వందల కోట్ల నష్టం ఏర్పడుతోంది. ఈ బంద్ ఎందుకు చేస్తున్నారు? ఎవరి స్వార్థం వల్ల చేయాల్సి వచ్చిందో చెప్పేందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంటూ నట్టి కుమార్ అసలు విషయం చెప్పుకొచ్చారు.

     అపుడు సురేష్ బాబు, అల్లు అరవింద్ అగ్రిమెంట్లు చేయించారు

    అపుడు సురేష్ బాబు, అల్లు అరవింద్ అగ్రిమెంట్లు చేయించారు

    ప్రింట్లు తీసేసి డిజిటల్ కు వచ్చినపుడు అంతా సపోర్టు చేశాం. భవిష్యత్తులో మంచి జరుగుతుందని అనుకున్నాం. ‘క్యూబ్' వెనక అల్లు అరవింద్ గారు, యూఎఫ్ఓ వెనక సురేష్ బాబు ఉండి తెలుగు రాష్ట్రాల్లో 2వేల థియేటర్లలో అగ్రిమెంట్లు చేయించారు అని... నట్టి కుమార్ తెలిపారు.

     కమిటీని నిర్వీర్యం చేశారు

    కమిటీని నిర్వీర్యం చేశారు

    2011లో నేను చాంబర్లో ఉన్నపుడు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు రేట్లు తగ్గించాలనే విషయమై డిస్కషన్ చేశాం. అపుడు అందరు పెద్దలు ఉన్నారు. ఆ రోజు ఒకటే చెప్పాం. బి క్లాస్ థియేటర్ కు 3 వేలు, సి క్లాస్‌కు 2 వేలు, ఏ క్లాస్ తొలివారం 7 వేలు, రెండో వారం 5 వేలు చార్జ్ మాత్రమే చేయాలని తీర్మాణం చేశాం. క్యూబ్, యూఎఫ్ఓల్లో భాగస్వామ్యం ఉండటంతో అల్లు అరవింద్ లాంటి పెద్దలు ఈ కమిటీని నిర్వీర్యం చేశారు.... అని నట్టి కుమార్ అన్నారు.

    ఆ రోజు లేని బాధ ఇప్పుడు ఎందుకు?

    ఆ రోజు లేని బాధ ఇప్పుడు ఎందుకు?

    ఆ రోజు లేని బాధ ఈ రోజు ఎందుకు వచ్చింది? క్యూబ్, యూఎఫ్ఓలలో మీ భాగస్వామ్యం పోయిందనా? అవి టోటల్ గా పబ్లిక్ ఇష్యూకు వెళ్లిపోయి మిమ్మల్ని తీసేశారనా? థియేటర్లు బంద్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? కూబ్ వారు దిగిరాకపోతే వారికి సహకరించడం మానేసి వేరే వారిని పోట్టుకోవాలి.... థియేటర్లు బంద్ చేయాల్సిన అవసరం ఏమిటి? అని నట్టి కుమార్ ప్రశ్నించారు.

     కోట్ల నష్టం, అందరూ రోడ్డు మీదకు వచ్చారు

    కోట్ల నష్టం, అందరూ రోడ్డు మీదకు వచ్చారు

    ఈ రోజు థియేటర్లు బంద్ చేయడం వల్ల రోజుకు 10 నుండి 15 కోట్లు లాస్. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు, గవర్నమెంటు అంతా నష్టపోతున్నారు. ఇంత నష్టం జరుగుతుంటే మీరు చేస్తున్నది ఏమిటి? కేవలం 25 శాతం తగ్గించాలని కోరుతున్నారు. మీరు 2 వేల రూపాయలు అడుగుతున్నారు. వారు 12 వందలు తగ్గిస్తామంటున్నారు. దీని కోసం బంద్ చేయాల్సిన అవసరం ఏమిటి? థియేటర్లను నాశనం చేయాల్సిన అవసరం ఏమిటి? ఎగ్జిబిటర్లను, డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడే పరస్థితికి ఎందుకు తీసుకొచ్చారు?... అంటూ నట్టి కుమార్ ప్రశ్నించారు.

     మీ స్వార్థం కోసం చేస్తున్నారు

    మీ స్వార్థం కోసం చేస్తున్నారు

    నాకు అర్థమైంది ఒకటే... వీళ్ల సొంత స్వార్థం కోసం ఇదంతా చేస్తున్నారు. సురేష్ బాబు, అల్లు అరవింద్ కలిసి క్యూబ్, యూఎఫ్ఓ లాంటి సంస్థలను బెదిరించడానికే ఈ బంద్ చేయిస్తున్నారు. మా మాట వినకుంటే తెలుగు రాష్ట్రాల నుండి మిమ్మల్ని బయటకు గెంటేస్తాం అని వారికి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. థియేటర్లన్నీ మా గుప్పిట్లో ఉన్నాయి అనే ఒక సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కేవలం వారి స్వార్థం కోసం చేస్తున్నారు... అని నట్టి కుమార్ తెలిపారు.

     థియేటర్లు అన్నీ వారి గుప్పిట్లోనే...

    థియేటర్లు అన్నీ వారి గుప్పిట్లోనే...

    తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అన్నీ అల్లు అరవింద్, సురేష్ బాబు గుప్పిట్లో ఉన్నాయి. 95 శాతం థియేర్లు వీరి చేతుల్లోనే ఉన్నాయి. వీరు లీజుల్లో భాగస్వాములుగా ఉన్నారు. నాలుగైదు నెలల నుండి చర్చలు జరుపుతున్నామంటున్నారు... నాలుగు నెలల నుండి మీరు ఏ కంపెనీతో టైఅప్ కాకుండా ఏ ఒక్క మిషన్ పెట్టుకోకుండా థియేటర్లు బంద్ చేయడానికి కారణం ఏమిటి? అగ్రిమెంటులో ఇంకో మిషన్ పెట్టుకోవడానికి అనుగుణంగా నిబంధనలు కూడా ఉన్నాయి. అయినా ఎందుకు చేయడం లేదు..... అని నట్టి కుమార్ ప్రశ్నించారు.

     ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన చిన్న సినిమాల పరిస్థితి ఏంటి?

    ఈ నెలలో రిలీజ్ అవ్వాల్సిన చిన్న సినిమాల పరిస్థితి ఏంటి?

    ఈ నెలంతా చిన్న సినిమాలు రిలీజ్ అవ్వాలి... ఆ నిర్మాతలంతా తమ సినిమాలు రిలీజ్ చేయకుండా ఆగిపోయారు. వీరికి ఎప్పుడు థియేటర్లు ఇస్తారు? ఈ నెల 30వ తేదీన మీ రంగస్థలం సినిమా మాత్రం రిలీజ్ అవ్వాలి, ఈ చిన్న సినిమాల నిర్మాతలు అప్పులు అయిపోయి వడ్డీలు పెరిగిపోయి రోడ్డుమీద పడిపోవాలా? అంటూ నట్టి కుమార్ ప్రశ్నించారు.

    దమ్ముటే మహేష్, బన్నీ సినిమాలు ఆపండి

    దమ్ముటే మహేష్, బన్నీ సినిమాలు ఆపండి

    దీని వల్ల చిన్న నిర్మాతలకు లాభం అంటున్నారు. ఏం లాభం? ఒకప్పుడు ప్రొజెక్టర్ ఉండే సమయంలో మాకు ఎలాంటి చార్జీలు ఉండేవి కావు. ఇపుడు మిషన్ బర్డెన్ పెట్టి మా వద్ద డబ్బు గుంజుతున్నారు. నాలుగు వేలు పెట్టినా చిన్న నిర్మాతకు బర్డనే కదా... పూర్తిగా చార్జీలు రిమూవ్ చేసే వరకు మీరు బంద్ చేయగలరా? బంద్ కొనసాగిస్తూ పెద్ద సినిమాలు ఆపగలరా? మహేష్ బాబు భరత్ అనే నేను, బన్నీ ‘నా పేరు సూర్య' దమ్ముంటే ఆపండి అంటూ నట్టి కుమార్ ప్రశ్నించారు.

     ఆ ఇద్దరే నాశనం చేశారు

    ఆ ఇద్దరే నాశనం చేశారు

    సురేష్ బాబు, అరవింద్ గారు తమ స్వార్థం కోసం చిన్న సినిమాల నిర్మాతలను, డిస్ట్రిబ్యూర్లు, డిస్ట్రిబ్యూటర్లను నాశనం చేశారు. దాదాపు 100 నుండి 200 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పటికే దెబ్బలు తిని తిని ఉన్నారు. సినిమా వారికి కష్టాలు వస్తే బంద్ చేయడం లేదు, ప్లాప్ అయితే బంద్ చేయడం లేదు. సినిమా ప్లాపయింది డబ్బు ఇవ్వమని హీరోను, డైరెక్టర్, హీరోన్ ను అడిగితే మళ్లీ డేట్స్ ఇవ్వడేమో అని భయం. లీజ్ థియేటర్ల వ్యవస్థ రద్దు చేయాలని బంద్ చేయగలరా? నిర్మాతలంతా కనీసం వారం పాటు బంద్ చేయగలరా? అంటూ నట్టి కుమార్ ప్రశ్నించారు.

     స్పైడర్, అజ్ఞాతవాసి పెద్ద ప్లాప్ అయ్యాయి... వారిని అడగరేం?

    స్పైడర్, అజ్ఞాతవాసి పెద్ద ప్లాప్ అయ్యాయి... వారిని అడగరేం?

    మొన్న స్పైడర్, అజ్ఞాతవాసి సినిమాలు పెద్ద ప్లాప్ అయ్యాయి. ఆ నష్టాలతో చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. కొందరు సూసైడ్ అటెమ్ట్ చేశారు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. దానికి మళ్లీ ఎమర్జెన్సీ మీటింగులు ఉంటాయి. ఎన్వీ ప్రసాద్ గారు కాబట్టి ‘స్పైడర్' వదిలేద్దాం, ‘అజ్ఞాతవాసి' కాబట్టి పవన్ కళ్యాణ్‌ను అడగొద్దుమనం...ఎవరైనా అమాయాకుడు ఏ కర్నాటక నుండి వచ్చిన నిర్మాతో, బొంబై నుండి వచ్చిన నిర్మాతో దొరికితే అడుగుదాం తప్ప వీరిని అడగొద్దు అనే రీతిగా ప్రవర్తిస్తారు. సినిమా ఇండస్ట్రీ ఇప్పటికైనా మేలు కోవాలి, పెద్దలందరూ వచ్చి చాంబర్లో కూర్చుని ఇండస్ట్రీని నాశనం చేస్తున్నారు.... అంటూ నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Producer Natti Kumar has criticized noted producer Allu Aravind for the theatres shutdown. He questioned who will bare the loss during the strike and backed the distributors who faced huge losses for Pawan Kalyan’s ‘Agnyaathavaasi’ movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X