మా దేశం లో సినిమా తీయండి : మన దర్శకుడిని కోరిన చైనా
టైగర్ ష్రాఫ్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన చిత్రం 'బాఘీ'. ఇటీవల విడుదలైన ఈచిత్రం ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్‌కి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో ఈచిత్రానికి సీక్వెల్ గా 'బాఘీ2' చిత్రాన్ని రూపొందించేందుకు దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..
ఆ సీక్వెల్‌ను తమ దేశంలో చిత్రీకరించమని చైనా ప్రభుత్వం నుంచి నిర్మాత సాజిద్ నదియడ్‌వాలా కు ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని సాజిద్ ధృవీకరించారు. "బాఘి" సినిమాకి దర్శకుడు సబ్బీర్‌ఖాన, హీరో హీరోయిన్లు టైగర్, శ్రద్ధతో పనిచెయ్యడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్సగా అభివర్ణించిన ఆయన ఆ కథను మరింత ముందుకు తీసుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు.

వచ్చే ఏడాది షాంఘైలో సీక్వెల్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేస్తున్నారు. "బాఘి 2" పనిని ప్రారంభించడానికి ఉద్వేగంతో ఎదురు చూస్తున్నట్లు సబ్బీర్‌ఖాన్ చెప్పాడు. షాంఘై నేపథ్యంలో ఆ చిత్రాన్ని తియ్యాలని సాజిద్ అనుకోవడం, దానికి తగ్గట్లు స్వేచ్ఛగా స్ర్కిప్టును రూపొందించే పనిని దర్శకునికి అప్పగించడం ఆనందాన్నిస్తోందని
అన్నాడు. కాగా ఈ సినిమా కోసం చైనాకు చెందిన మార్షల్ ఆర్ట్స్ నిపుణుల వద్ద టైగర్ ట్రైనింగ్ తీసుకోనున్నట్లు సమాచారం. సీక్వెల్‌తో "బాఘి" ని మరో స్థాయికి తీసుకు వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పాడు టైగర్.
తెలుగు హీరో సుధీర్ బాబు ఈ సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే . . సినిమాకి డివైడెడ్ టాక్ లభించినప్పటికీ.. సినిమాలో సుధీర్ బాబు నటనకు మాత్రం మంచి మార్కులు లభించాయి. అయితే ఇప్పుడు వచ్చే సీక్వెల్ లో సుధీర్ బాబు ఉంటాడా లేదా అన్న విశయం పై ఏ సమాచారమూ లేదు..


Click it and Unblock the Notifications











