రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని నిర్మత రామానాయుడు కుమారుడు దగ్గుపాటి సురేష్ బాబు స్పష్టం చేశారు. తన తండ్రి పది సంవత్సరాలు రాజకీయాలలోసేవ చేసి అలసిపోయారని ఆయన గుర్తు చేశారు. ఆయన హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను తెలిపారు. సినిమాకు, రాజకీతాలకు అవినాభావ సంబంధం ఉందంటున్న ఆయన రాజకీయాల్లో మాత్రం ప్రవేశించబోనని అంటున్నారు. తాను ఏ పార్టీకి వ్యతిరేనిని కానని చెప్పారు. కాంగ్రెస్, టిడిపి, తెరాస అన్ని పార్టీలు కావాలని అన్నారు. త్వరలో రానున్న చిరు పార్టీ కూడా కావాలని ఆయన తెలిపారు. అన్ని పార్టీలతోనూ సఖ్యంగా ఉండాలనేదే తన అభిలాష అని చెప్పారు.