twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఫెక్ట్ అయ్యేది నేనే, నిర్మాత కాదు: తేల్చి చెప్పిన సుకుమార్

    By Bojja Kumar
    |

    'ఆర్య' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్.... తన 14 ఏళ్ల కెరీర్లో ఇప్పటి వరకు 7 సినిమాలు మాత్రమే చేశారు. 'రంగస్థలం' ఆయన చేస్తున్న 8వ సినిమా. ఆయన సినిమాలు చాలా స్లోగా చేస్తారనే అసంతృప్తి అభిమానుల్లో ఉంది. సుకుమార్ ప్రస్తుత చిత్రం 'రంగస్థలం' కోసం కూడా చాలా రోజులు తీసుకున్నారనే విమర్శ ఉంది. ఇటీవల మీడియా సమావేశంలో సుకుమార్‌కు ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

    Recommended Video

    ఆమెతో ఉంటే ఓ ఎనర్జీ వస్తుంది...!
    ఎఫెక్ట్ అయ్యేది నేనే...

    ఎఫెక్ట్ అయ్యేది నేనే...

    నేను సినిమాలు స్లోగానే చేస్తాను. అయితే దీని వల్ల నిర్మాతలకు ఎలాంటి ఎఫెక్ట్ కానీ, నష్టం కానీ ఉండదు. ఎఫెక్ట్ అయ్యేది నేనే.... అని సుకుమార్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

    నాకు కథలు అంత త్వరగా నచ్చవు

    నాకు కథలు అంత త్వరగా నచ్చవు

    ‘నాకు కథలు అంత త్వరగా నచ్చవు. ఆ కథతో సింక్ అవ్వడానికి నాకు చాలా సమయం పడుతుంది. నేను అనుకున్న విధంగా కథ వచ్చే వరకు మార్పులు చేస్తూనే ఉంటాను. నేను ఎక్కువ సమయం స్క్రిప్టు, సీన్లు ఇంప్రూవ్ చేయడానికి కేటాయిస్తాను అని సుకుమార్ తెలిపారు.

    షూటింగ్ స్పాట్లో కూడా...

    షూటింగ్ స్పాట్లో కూడా...

    నేను రాసుకున్న స్క్రిప్టు ఒక్కోసారి షూటింగ్ సమయంలో తేడీ అనిపించేది. షూటింగ్ స్పాట్లోనే కూర్చుని రాసిన సందర్భాలున్నాయి. కథను జడ్జ్ చేయడంలో నేను చాలా స్లో. అందుకే నా నుండి సినిమాలు చాలా లేటుగా వస్తుంటాయి అని సుకుమార్ తెలిపారు.

    నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు

    నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు

    నేనుప్పుడూ నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు. వారు కంఫర్టుగా ఫీలయ్యే విధంగా నడుచుకుంటాను. సంవత్సరంలోనే సినిమా పూర్తి చేస్తాను. రంగస్థలం సినిమా గతేడాది ఏప్రిల్‌లో మొదలైంది, ఈ మార్చి 30న సినిమా విడుదలవుతోంది. తక్కువ సినిమాలు చేయడం వల్ల లాస్ అయ్యేది నేనే, నా వర్కింగ్ నేచర్ వల్ల నిర్మాతలు ఎప్పుడూ నష్టపోలేదు.... అని సుకుమార్ తెలిపారు.

    English summary
    "I don't like a story quickly, I spend most of time improving the scenes and script.. But I see that it won't hurt my producers. I want them to feel comfortable all the time and finish a film within an year. We started Rangasthalam last April and it is releasing on 30th March. So, it is me who is at loss, as I will make only fewer films but producers will not be at loss due to my working nature," said director Sukumar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X