»   » రామ్‌ చ‌ర‌ణ్ నువ్వు కేక, రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు (ఫోటోస్)

రామ్‌ చ‌ర‌ణ్ నువ్వు కేక, రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కూల్ ప్రీత్ సింగ్ జంట‌గా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ' ధృవ' చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. సెప్టెంబ‌ర్ 5 నాటికి టోట‌ల్ టాకీ కంప్లీట్ చేస‌కుని మిగిలిన సాంగ్స్ ని కూడా అదే నెల‌లో షూటింగ్ చేస‌కుంటుంది.

ఇప్ప‌టికే పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాతలు అల్లు అర‌వింద్‌, ఎన్‌.వి.ప్ర‌సాద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అక్టోబ‌ర్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌ట‌న‌తో పాటు అర‌వింద్ స్వామి ఫెర్‌ఫార్మెన్స్ హైలెట్ గా నిలుస్తుంది.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత‌ల్లో ఓక‌రైన‌ అల్లు అరవింద్ మాట్లాడుతూ.... రాంచరణ్ , ర‌కూల్ ప్రీత్ సింగ్‌, సురేందర్ రెడ్డి కాంబినేష‌న్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ' ధృవ' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 'ధృవ' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశాం. మంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది అన్నారు.


స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోస్..


పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్

పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్

పవర్ ఫుల్ ఐపిఎస్ ఆఫీసర్ కథాంశంతో కూడిన కథ కావడం, దానికి తగ్గట్టుగా రాంచరణ్ తన బాడీ లాంగ్వేజ్, లుక్స్ మార్చుకున్నాడు.


ఎలాంటి ఆలస్యం లేకుండా

ఎలాంటి ఆలస్యం లేకుండా

ఏమాత్రం డిలే లేకుండా షూటింగ్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 5 నాటికి సాంగ్స్‌ మిన‌హ టోట‌ల్ టాకీ ఫినిష్ అవుతుందని నిర్మాతలు తెలిపారు.


పోస్టు ప్రొడక్షన్

పోస్టు ప్రొడక్షన్

మ‌రో ప‌క్క శ‌ర‌వేగంగా పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయని నిర్మాతలు తెలిపారు.


రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

ఎక్క‌డా చిన్న డిలే లేకుండా అనుకున్న విధంగానే అక్టోబ‌ర్ 7న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్నాము . అని అన్నారు.


నటీనటులు

నటీనటులు

రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు


టెక్నీషియన్స్

టెక్నీషియన్స్

సినిమాటోగ్రాఫ‌ర్‌- పి.య‌స్‌.వినోద్‌
మ్యూజిక్ - హిప్ హాప్ ఆది
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
ఆర్ట్ - నాగేంద్ర
ఎడిటర్ - నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్
ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్, ఎన్‌.వి.ప్ర‌సాద్‌
దర్శకుడు - సురేందర్ రెడ్డి


రీమేక్

రీమేక్

తమిళంలో సూపర్ హిట్టయిన తాని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా దృవ చిత్రం తెరకెక్కుతోంది.


అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

సురేందర్ రెడ్డి దర్శకత్వం కావడం, రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


దసరా కానుక

దసరా కానుక

దసరా కానుకగా ఈ సినిమా రాబోతోంది. అభిమానులకు పండగ ట్రీట్ లా ఈ సినిమా ఉండబోతోంది.


త్వరలో ఆడియో

త్వరలో ఆడియో

సెప్టెంబర్లో ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
English summary
Producer Allu Aravind said, “Final schedule of talkie part is in progress will be wrapped up by 5th September and post-production works are also happening simultaneously. Balance songs will be canned soon We are releasing the film on October 7th, on the special eve of Dussehra, without any delay.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu