»   »  పవన్ కళ్యాణ్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

పవన్ కళ్యాణ్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడూ ఏదో ఒక విధంగా తన వ్యాఖ్యలతో సంచలనం క్రియోట్ చేసి వార్తల్లో ఉంటే రామ్ గోపాల్ వర్మ మరో సారి తన బాణాన్ని మెగా ఫ్యామిలీపై గురి పెట్టారు. అయితే అది ఓ టాలీవుడ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూ సీరిస్ కోసం కావటం విశేషం. ఈ పోగ్రామ్ కు చెందిన ప్రోమోను విడుదల చేసారు. దాన్ని ఇక్కడ చూడండి.


ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం నుంచీ వరస ట్వీట్స్ తో వర్మ పెద్ద రాద్దాంతమే చేస్తున్నారు. దేవుడా.. నిరూపించుకో అంటూ రామ్ గోపాల్ వర్మ ఛాలెంజ్ లు విసురుతున్నారు.
Promo of talking about Mega Star and Mega family

దేశాలు, ఇతర దేశాల సహాయం తీసుకున్నట్లే దేవుళ్లు కూడా ఇతర దేవుళ్ల సాయం తీసుకుంటారా ? అహ..జస్ట్ అడుగుతున్నాను. ఒకవేళ దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటే.. ఆయన పేరు మీద జరుగుతున్న హింసను చూస్తూ శాడిస్టికల్లీ ఎంజాయ్ చేయడం తప్ప బయటకి వచ్చి ఎందుకు మాట్లాడడు?

తన పేరుతో జరుగుతున్న మానవ హింసను అడ్డుకునే శక్తి దేవుడికి లేనప్పుడు... అసలు దేవుడు అనిపించుకోవడంలో అర్థమేముంది? అమాయకులను చంపేసిన టెర్రరిస్టుల పట్ల నిరసన వ్యక్తం చేయడం బదులు.. టెర్రరిస్టులకు ఆ అవకాశం కల్పించిన భగవంతుడి పట్ల మనం నిరసన తెలపాలి. అమెరికా, పుతిన్, కొందరు ముస్లిం నాయకులతో పోల్చి చూస్తే నిజంగా దేవుడే టెర్రరిస్టుల పక్షాన ఉన్నట్లు కనిపిస్తోంది.

ఇకనైనా ఒక్కసారి బయటకు వచ్చి తను ఎవరి తరఫున ఉన్నాడో నిరూపించుకోవడానికి దేవుడికి ఇదే సరైన సమయం..అంటూ రామూ చెలరేగిపోయాడు.

English summary
Ram Gopal Varma again targets Chiranjeevi and Pawan Kalyan in his TV Show.
Please Wait while comments are loading...