»   » డమ్మీ సాక్ష్యం :సల్మాన్ ఖాన్ కేసులో కొత్త ట్విస్ట్...

డమ్మీ సాక్ష్యం :సల్మాన్ ఖాన్ కేసులో కొత్త ట్విస్ట్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి : బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ హిట్ అండ్ రన్ కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఇప్పుడు డమ్మీ సాక్ష్యం ఇచ్చాడని పబ్లిస్ ప్రాసిక్యూటర్ అంటున్నారు. 2002లో ఖాన్ నిర్లక్ష్యంగా కారునడిపి ఒకరి మృతికి కారణమయ్యాడన్నది అభియోగం. సబర్బన్‌బంద్రాలో 2002 సెప్టెంబర్ 28 రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ విచారణ తుది దశకు చేరుకుంది.

ఇటీవలే సల్మాన్‌ఖాన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. రెండ్రోజుల క్రితం ఖాన్ ఫ్యామిలీ డ్రైవర్ అశోక్ సింగ్ సాక్ష్యం చెబుతూ ప్రమాదం జరిగే సమయంలో లాండ్ క్రూయిజ్ కారు తానే నడుపుతున్నట్టు తెలిపాడు. అయితే డ్రైవర్ వాంగ్మూలంతో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘారట్ ఏకీభవించలేదు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Prosecution calls Salman Khan’s driver a dummy witness

బుధవారం సెషన్స్ కోర్టులో కేసు తుది విచారణ సందర్భంగా ప్రదీప్ వాదనలు వినిపిస్తూ ప్రధాన నిందితుడిగా ఉన్న సల్మాన్‌ఖాన్ ఇంతకు ముందు ఎప్పుడూ డ్రైవర్ అశోక్‌సింగ్ పేరును ప్రస్తావించలేదని అన్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ సందర్భంగానూ జరిగిన వాదనలను పిపి కోర్టు దృష్టికి తెచ్చారు.

ఈ కేసు విచారణలో మొదటి నుంచీ కారు తనసొంతమేనని ప్రమాదంతో తనకు సంబంధం లేదని నిందితుడు చెబుతూ వచ్చాడని ప్రదీప్ అన్నారు. హఠాత్‌గా డ్రైవర్ అశోక్‌సింగ్‌ను తెరమీదకు తెచ్చారని ఆయన ఆరోపించారు. ప్రమాదం జరిగే సమయంలో సల్మాన్‌ఖాన్ మద్యం తాగి ఉన్నాడని, అంతేకాకుండా అతడికి లైసెన్స్ లేదని ప్రాసిక్రూషన్ అభియోగం.

కేసు వివరాల్లోకి వెళితే...

2002 సెప్టెంబర్ 28న అర్ధరాత్రి ముంబైలో ఓ హోటల్ నుంచి సల్మాన్ కారులో వస్తుండగా రోడ్డుపై నిద్రిస్తున్నవారిపైకి ఆ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. కేసును విచారణకు స్వీకరించిన స్థానిక కోర్టు.. ఇప్పటివరకు 25 మంది నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేసింది. చివరిగా సల్మాన్‌ఖాన్ స్టేట్‌మెంట్‌ను శుక్రవారం రికార్డు చేయనుంది.

తాను కృష్ణజింకల వేట కేసులో జోధ్‌పూర్ కోర్టుకు హాజరవ్వాల్సి ఉన్నందున స్టేట్‌మెంట్ రికార్డును వాయిదా వేయాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను గురువారం కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ శుక్రవారం ముంబై స్థానిక కోర్టు హాజరై.. వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. నేరం రుజువైతే సల్మాన్‌ఖాన్‌కు పది సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

English summary
The prosecution on Wednesday countered Salman Khan’s statement in the 2002 hit-and-run case, stating that evidence pertaining to the presence of a fourth person in the car being Salman Khan’s driver Ashok Singh was “never suggested’ before and this defence was only developed when the actor appeared in court.
Please Wait while comments are loading...