»   »  'ఖైదీ నెం.150' : ఫేస్ బుక్ లో లేటెస్ట్ గా ఇంకో పోస్ట్ పెట్టిన ఫృధ్వీ

'ఖైదీ నెం.150' : ఫేస్ బుక్ లో లేటెస్ట్ గా ఇంకో పోస్ట్ పెట్టిన ఫృధ్వీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్:''మెగాస్టార్ గారి 150వ మూవీలో నటించడం నా అదృష్టం. సీన్స్ తీసివేయడం నా దురదృష్టం. సంక్రాంతి రోజున మా మదర్ చనిపోయినంత బాధగా ఉంది''. ఇది రీసెంట్‌గా పృథ్వీ తన ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్. ఈ పోస్ట్ చూసిన వారంతా అవాక్కయ్యారు. పృథ్వీ ఎందుకింత ఎమోషనల్ అయ్యాడో ఎవరికీ అర్థం కాలేదు.

  మీడియాలో ఈ విషయం స్ప్రెడ్ అయ్యింది. సోషల్ మీడియాలో సైతం ఈ విషయం గురించే మాట్లాడుకోవటం మొదలెట్టారు. ఈ లోగా ఈ జరిగిందో ఏమో ..ఫృధ్వీ ఆ పోస్ట్ ని డిలేట్ చేసేసారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు మరోసారి...ఫృధ్వీ సోషల్ మీడియాలో ఈ విషయమై ఓ పోస్ట్ పెట్టారు.


  ఖైదీ నెంబర్ 150 వ చిత్రంలో నా పాత్ర ను తొలిగించారంటూ వచ్చిన రూమర్స్ వచ్చాయి. అదంతా మనోరంజని అనే ఓ వెబ్ సైట్ పబ్లిష్ చేసింది. అది చూసి నేను చిన్న డిస్ట్రబెన్స్ కు లోనయ్యాను. చిరంజీవితో కలిసి స్క్రీన్ పంచుకోవటం,నటించటం నా అదృష్టం. మెగాస్టార్ గారితో నేను తొలి సారి కలిసి నటించటం చాలా ఆనందంగా ఉన్నానంటూ రాసుకొచ్చారు. ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డ్ లు బ్రద్దలు కొడుతుంది అన్నారు.

  సాధారణంగా ..కొన్నికొన్ని సందర్భాల్లో సినిమాలో సీన్స్‌ను ఎడిటింగ్‌లో నిడివి దృష్ట్యా తొలగించడం సహజం. పెద్ద పెద్ద స్టార్స్ నటించిన సీన్స్ కూడా గతంలో చాలా సినిమాల్లో తొలగించారు. కానీ పృథ్వీ స్పందించిన రీతిలో ఎవరూ బయటపడలేదు

  Prudhvi again shares another post in Facebook

  . సినిమాలో సీన్స్‌కు, తల్లి చావుకు ముడిపెట్టడమేంటని పృథ్వీపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ లోగా ఓ టీవీ ఛానెల్ వారు ఈ విషయమై ఫృధ్వీని మాట్లాడించారు. దాంతో అప్పటికి అర్దమైనట్లుంది ఆ పోస్ట్ ఎంత స్పీడుగా స్పెడ్ అయ్యిందో.. ఈ పోస్ట్ పెట్టడంపై రివర్స్ లో స్పందించి, మొత్తం మీడియాపై కి తోసేస్తూ ..పృథ్వీ స్పందించాడు.

  ఫృధ్వీ మాట్లాడుతూ..ఖైదీ నెం.150 సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ దొరికినా చాలనుకున్నానని, అలాంటిది మంచి పాత్ర దొరకడంతో సంతోషపడినట్లు తెలిపాడు. కానీ తాను నటించిన సీన్స్ తీసేయడంతో చాలా బాధపడినట్లు తెలిపాడు. తాను ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి సినిమాలే కారణమని చెప్పాడు. అలాంటి హీరో సినిమాలో చేయకపోవడమనేది న్యూ ఇయర్‌లో తనకో పెద్ద షాక్ అని పృథ్వీ తెలిపాడు.

  మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 150వ చిత్రం 'ఖైదీ నెం.150' ఈ సంక్రాంతి కానుకగా ఈ నెల 11న విడుదలవుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విషయంలో తెలుగులో వరస సినిమాలతో ఏలుతున్న స్టార్ కమెడీయన్ పృధ్వీని తెగ బాధపెట్టేసింది. ఈ విషయాన్ని స్వయంగా పృద్వీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు.

  English summary
  Comedian Prudhvi Shared a post in FB: " There had been many rumors around my character being chopped off from Khaidi No.150 movie. It was all because of a website named Manoranjani which published this. That caused me a little disturbance. Acting and sharing screen space with Mega Star Chiranjeevi garu is a privilege. Extremely happy for the time I spent with Megastar garu. Wishing #KhaidiNo150 movie would break all box office records and becomes a blockbuster"
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more