For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాజశేఖర్ గ‌రుడ‌వేగ’కు సెన్సార్‌ కూడా ప్లస్సయింది

  By Bojja Kumar
  |
  గ‌రుడ‌వేగ’కు సెన్సార్‌ కూడా ప్లస్సయింది..

  జ్యో స్టార్ ఎంట‌ర్‌ప్రైజెస్ బ్యాన‌ర్‌పై యాంగ్రీ యంగ్ మేన్‌గా, ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ క్యారెక్ట‌ర్స్‌తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో డా.రాజ‌శేఖ‌ర్ క‌థానాయ‌కుడిగా రూపొందిన చిత్రం పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం. పూజా కుమార్‌, శ్ర‌ద్ధాదాస్‌, కిషోర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

  ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్వ‌క‌త్వంలో కోటేశ్వ‌ర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 3న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఓ సిన్సియ‌ర్ ఎన్ఐఎ ఆఫీస‌ర్ దేశం కోసం, త‌న కుటుంబం కోసం ఏం చేశాడ‌నే క‌థాంశంతో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం.

  అనుకూలంగా సెన్సార్

  అనుకూలంగా సెన్సార్

  కుటుంబం మొత్తం కలిసి చూసేలా సెన్సార్ సర్టిఫికెట్ కూడా యు/ఎ సర్టిఫికెట్ రావడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

  కోటేశ్వర్ మాట్లాడుతూ

  కోటేశ్వర్ మాట్లాడుతూ

  నిర్మాత కోటేశ్వ‌ర్ రాజు మాట్లాడుతూ....``మా బేన‌ర్‌లో తొలి వ‌స్తోన్న తొలి సినిమా `పిఎస్‌వి గ‌రుడ‌వేగ 126.18ఎం`. సినిమా ప్రారంభం సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. రాజ‌శేఖ‌ర్‌గారు స‌రికొత్త పాత్ర‌లో స్టైలిష్ లుక్‌లో క‌న‌ప‌డ‌నున్నారు. ప్ర‌తి పాత్ర సినిమాలో కీల‌క‌మే. హీరోయిన్ పూజా కుమార్ ఇందులో గృహిణి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అదిత్ అరుణ్ కీల‌క పాత్ర‌లో న‌టించారు. శ్ర‌ద్ధాదాస్ ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. కిషోర్ మెయిన్ విల‌న్‌గా న‌టించారు. పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌వివ‌ర్మ‌, నాజ‌ర్‌, పృథ్వీ, షాయాజీ షిండే త‌దిత‌రులు సినిమాలో న‌టించారు. ఇలా భారీ తారాగ‌ణం, సాంకేతిక నిపుణులతో మేకింగ్‌లో ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా సినిమాను హై టెక్నిక‌ల్ వేల్యూస్‌తో రూపొందించాం. ప్రెస్టీజియ‌స్‌గా నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ణు పొందింది. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను న‌వంబ‌ర్ 3న గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.

  నటీనటులు

  నటీనటులు

  రాజ‌శేఖ‌ర్‌, పూజా కుమార్‌, శ్రద్ధ దాస్ , సన్నీలియోన్ , ఆదిత్‌, కిషోర్‌, నాజ‌ర్‌, ఆద‌ర్శ్‌, శ‌త్రు, ర‌విరాజ్‌లు ప్రొఫెష‌న‌ల్ కిల్ల‌ర్స్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నున్నారు. శ్రీనివాస్ అవ‌స‌రాల కామెడి పాత్ర పోషిస్తున్నాడు. అలీ సైకాల‌జిస్ట్ పాత్ర‌లో, పృథ్వీ నింఫోమానియ‌క్ పేషెంట్‌గా, పోసాని కృష్ణ‌ముర‌ళి, షాయాజీ షిండే పొలిటిషియ‌న్స్ పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

  టెక్నీషియన్స్

  టెక్నీషియన్స్

  ఈ చిత్రానికి సంగీతంః శ్రీచ‌ర‌ణ్ పాకాల‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ః భీమ్స్‌, సినిమాటోగ్ర‌ఫీః అంజి, గికా చెలిడ్జే, బకూర్ చికోబావా, సురేష్ ర‌గుతు, శ్యామ్‌, ఎడిటింగ్ః ధ‌ర్మేంద్ర కాక‌రాల‌, ఆర్ట్ః శ్రీకాంత్ రామిశెట్టి, స్టంట్స్ః నూంగ్‌, డేవిడ్ కుబువా, స‌తీష్‌, బాబీ అంగారా, నిర్మాత: కొటేశ్వ‌ర్ రాజు, ద‌ర్శ‌క‌త్వం: ప‌్ర‌వీణ్ స‌త్తారు.

  English summary
  'PSV Garuda Vega', directed by Praveen Sattaru, has undergone Censor formalities. It has been certified with U/A. The racy action-thriller will hit the screens on November 3rd in a grand way. Starring Dr. Rajasekhar in the role of a gusty, sharp-witted NIA officer, this one boasts of superb action sequences and rich technical values.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X