»   » అల్లు అర్జున్ సరసన హీరోయన్ ఎవరు?

అల్లు అర్జున్ సరసన హీరోయన్ ఎవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న దువ్వాడ జగనాథం చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవి శ్రీ బాణీలు కడుతున్నాడు. అయితే ఈ చిత్రంలో బన్నీ సరసన నటించే భామ ఎవరనే దానిపై ఆసక్తి చోటు చేసుకుంది. ఇటీవల మెహరీన్, కాజల్ లాంటి కొందరు హీరోయిన్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ తాజాగా మరో భామ ఆ అవకాశం దక్కించుకుందునే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ మొహెంజదారో చిత్రంలో నటించి అలరించిన పూజా హెగ్డే ఇప్పుడు డీజేలో గోల్డెన్స్ ఛాన్స్ దక్కించుకుందనే టాక్స్ వినిపిస్తున్నాయి. మెగా హీరో వరుణ్ తేజ్ సరసన ముకుంద చిత్రంలో నటించిన పూజా మరో మెగా హీరో బన్నీ సరసన నటించనుందనే విషయంపై పూర్తి క్లారిటీ లేకపోయిన సన్నిహితుల వర్గాల నుండి ఈ తారనే ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

English summary
స్టార్ అల్లు అర్జున్, క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న దువ్వాడ జగనాథం చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న సంగతి తెలిసిందే.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu