»   » ఐటి రైడ్స్ ఎఫెక్ట్: ‘పులి’ రిలీజ్ ఆగి పోయింది

ఐటి రైడ్స్ ఎఫెక్ట్: ‘పులి’ రిలీజ్ ఆగి పోయింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ విజయ్ నటించిన భారీ చిత్రం‘పులి' ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, హిందీలో విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషయంలో సినిమా రిలీజ్ ఆగి పోయింది. నిన్న విజయ్ తో పాటు పలువురు సినీ స్టార్ నివాసాలు, కార్యాలయాలపై ఐటి రైడ్స్ జరగిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ రివర్స్ అవ్వడంతో ఫైనాన్సియల్ ఇబ్బందులు వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకైతే బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోలు రద్దయ్యాయి. సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతలు జెమిని ల్యాబ్‌లో చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్నం షో వరకైనా సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Puli morning shows stalled

శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్‌పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్‌పై సి జె శోభ విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీదేవి కూడా నటిస్తున్నారు. సినిమాలో ఆమె కీలకమైన పాత్రలో మహారాణిగా కనిపించబోతున్నారు. విజయ్‌ సరసన శృతి హాసన్‌, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ స్టార్‌ సుదీప్‌, ప్రభు, తంబి రామయ్య, సత్యన్‌, జూనియర్‌ బాలయ్య, నరేన్‌, జో మల్లూరి, మధుమిత, అంజలీదేవి, గాయత్రితో పాటు 40 మంది ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.

English summary
Puli morning shows stalled in last minute due to financial problems.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu