»   » ‘పులి’ బోనులోనించి 1000 థియేటర్లలోకి జంప్

‘పులి’ బోనులోనించి 1000 థియేటర్లలోకి జంప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విడుదలకు ముందు పలువివాదాలను ఎదుర్కొన్న 'కొమరం పులి' చిత్రం ఎట్టకేలకు ఈ నెల 10న విడుదలవుతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సింగనమల రమేష్ బాబు బుధవారంనాడు తెలియజేశారు. ఆయన తన కార్యాలయంలో ప్రింట్లను పంపించే పనిలో ఉన్నారు.

డిస్ట్రిబ్యూటర్లు సందడి నెలకొంది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల కోసం పలు థియేటర్లను బుక్ చేశారు. చిన్నాచితకా చిత్రాలు విడుదలలు కూడా ఆగిపోయాయి. 'కొమరం పులి' చిత్రాన్ని600 ప్రింట్లతో 1000 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పవన్ కల్యాణ్ చిత్రాల్లోనే చరిత్ర సృష్టిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

టైటిల్‌ పై వచ్చిన వివాదాలకు ఆయన స్పందిస్తూ...కోర్టు స్టే ఇచ్చిందనే వార్తలు అవాస్తవాలనీ, అది నిజమని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. ఎటువంటి వివాదాలు లేవని స్పష్టం చేశారు. త్వరలో తాము కొమరం భీమ్ కుటుంబాన్ని కలుస్తామని చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu