»   » 150 చాలా స్పెషల్... అందుకే ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్!

150 చాలా స్పెషల్... అందుకే ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన పులిమురుగన్(తెలుగులో 'మన్యం పులి') చిత్రం భారీ విజయం సాధించిన నేపథ్యంలో గ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. శనివారం కొచ్చిలో ఇందుకు సంబంధించిన వేడుక గ్రాండ్ గా జరిగింది.

జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు. 2016 దసరాకి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 150 రోజులు ఆడటంతో పాటు 150 కోట్లు వసూలు చేసింది.


150 కోట్లు, 150 రోజులు

150 కోట్లు, 150 రోజులు

ఈ చిత్రం తెలుగులోను మన్యం పులి టైటిల్ తో విడుదలై మంచి విజయం సాధించింది. మళయాల చిత్ర పరిశ్రమలో 150 కోట్లు వసూలు చేసిన తొలి సినిమా ఇదే. అందుకే ఈ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు.


గ్రేట్ అచీవ్మెంట్

గ్రేట్ అచీవ్మెంట్

ఏ మాలయాళ చిత్రం కూడా ఈ చిత్రం సాధించిన వసూళ్లని రాబట్టలేదు, అందుకే మన్యం పులి చిత్రానికి సంబంధించిన వేడుక ఇప్పటి వరకు ఎన్నడూ లేనంత హైలెట్ గా నిర్వహించారు. ఈ వేడుకకు భారీగా అభిమానులు హాజరయ్యారు.


100 కోట్లే ఎక్కువ అనుకుంటే...150 కోట్లు వసూలయ్యాయి!

100 కోట్లే ఎక్కువ అనుకుంటే...150 కోట్లు వసూలయ్యాయి!

అక్కడ ఓ ఒక సినిమా రూ. 50 కోట్లు వసూలు చేసిందంటే.... బ్లాక్ బస్టర్ హిట్ కిందే లెక్క. ఇంత వరకు ఆ ఇండస్ట్రీలో వంద కోట్ల మార్కును అందుకున్న సినిమానే లేదు. అలాంటి ఇండస్ట్రీలో ఈ సినిమా 150 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.


మాస్ పులి ( మోహన్ లాల్ 'మన్యం పులి' రివ్యూ )

మాస్ పులి ( మోహన్ లాల్ 'మన్యం పులి' రివ్యూ )

150 కోట్లు సాధించిన ఈ సినిమాలో ఏముంది? ప్రేక్షకులను అంతగా ఆకట్టుకున్న అంశాలు ఏమిటి? అనే అంశాల కోసం మన్యం పులి చిత్రానికి సంబంధించిన రివ్యూ చదవండి.


English summary
Pulimurugan 150 Days Celebration held at Cial Convention Center,in the precens of Mohanlal, Vyshakh, Kamalini mukerji, Dileep, Namitha, Siddique etc.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X