»   » మాస్ పులి ( మోహన్ లాల్ 'మన్యం పులి' రివ్యూ )

మాస్ పులి ( మోహన్ లాల్ 'మన్యం పులి' రివ్యూ )

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

మనమంతా, జనతాగ్యారేజ్ వచ్చిన తర్వాత మోహన్ లాల్ ఇక్కడ తెలుగులో కూడా ఫేమస్ అయ్యిపోయారు. దాంతో ఆయన హిట్ చిత్రాలను డబ్బింగ్ చేసి వదలటం మొదలైంది. అయితే అవన్నీ ఒక ఎత్తు. తాజాగా మళయాళంలోనూ దాదాపు 125 కోట్లు వసూలు చేసి అక్కడ పరిశ్రమలో బాహుబలిని దాటిన రికార్డ్ ని క్రియేట్ చేసిన పులి మురుగన్ ఒకెత్తు.


ఈ వయస్సులోనూ మోహన్ లాల్ చేసిన ఫైట్స్ కు అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ముఖ్యంగా పులితో తీసిన సీక్వెన్స్ లు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. డిఫరెంట్ బ్యాక్ డ్రాఫ్ తో వచ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తే...అన్ని వర్గాలని ఆకట్టుకుంది.


ఈ చిత్రాన్ని సింధూరపువ్వు , సాహసఘట్టం వంటి డబ్బింగ్ చిత్రాలతో ఫేమస్ అయిన నిర్మాత కృష్ణారెడ్డి తెలుగుకి తేవటంతో మరింత క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం ఎలా ఉంది...తెలుగులో వర్కవుట్ అవుతుందా..లేక సోసోగా డబ్బింగ్ చిత్రం అనిపించుకుంటుందా వంటి విషయాలు క్రింద చూద్దాం.


హీరో ఏం చేస్తూండంటే...

హీరో ఏం చేస్తూండంటే...

కేరళలో అడవి పక్కన పులివూరె అని ఓ చిన్న గ్రామం లో ఈ కథ జరుగుతుంది. అక్కడ అడవిలోంచి పులులు వచ్చి గ్రామస్థులపై దాడి చేసి చంపేస్తుంటాయి. అలా ఎప్పుడు పులి వచ్చినా అందరూ కుమార్ (మోహన్‌లాల్‌) కోసమే చూస్తుంటారు. లారీ డ్రైవర్‌గా పనిచేసే మురుగన్‌ పులులను వేటాడి చంపడంలో దిట్ట.


ఇదీ చిన్నప్పటి మోహన్ లాల్ కథ

ఇదీ చిన్నప్పటి మోహన్ లాల్ కథ

పులి కుమార్‌ (మోహన్‌లాల్‌)....చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటాడు... తండ్రిని కళ్లెదుటే పెద్ద పులి తినేస్తుంది. అప్పట్నుంచి తమ్ముడు సుబ్రమణ్యంకి అన్నీ తానై బతుకుతుంటాడు. తన తండ్రిని చంపిందన్న కోపంతో చిన్న వయసులోనే పులిని తన బావ సాయంతో మట్టుబెడతాడు. అప్పటి నుంచి పులిని వేటాడ‌టంలో ఆరితేరుతాడు ఆ తర్వాత అడవిలో ఉండే పులియూరుకి పులుల బెడద రాకుండా కాపాడుతుంటాడు.


ఫారెస్ట్ ఆఫీసర్ తో ..

ఫారెస్ట్ ఆఫీసర్ తో ..

అక్కడ అడివిలో తిరుగుతూంటే అనాథ అయిన మైనా (క‌మ‌లిని ముఖ‌ర్జీ)ని ప్రేమించి పెళ్లాడుతాడు. వాళ్ల‌కి చిన్ని అనే పాప కూడా ఉంటుంది. ప్రసాంతంగా సాగిపోతున్న అతని జీవితం... గతంలో తనతో గొడవపడ్డ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (కిశోర్‌) అక్కడికి ట్రాన్సఫర్ అయిరావటంతో సమస్యలో పడుతుంది. ఆ రేంజర్ తో కుమార్‌కి గొడ‌వ‌లు మ‌ర‌లా తిర‌గ‌బెడుతాయి. దాంతో ఫారెస్ట్ ఆఫీస‌ర్ నుంచి అత‌నికి ఇబ్బందులు మొద‌ల‌వుతాయి.


జగపతిబాబు తో ..

జగపతిబాబు తో ..

మరో ప్రక్క తన ప్రాణానికి ప్రాణమైన తమ్ముడు సుబ్రమణ్యంకి ఉద్యోగం ఇస్తామని ఆశ చూపడంతో కుమార్...తప్పనిసరి పరిస్దితుల్లో ..అడవి నుంచి గంజాయిని డాడీ గిరిజ (జగపతిబాబు)కి చెందిన ఆయుర్వేద కంపెనీకి చేరవేస్తాడు. అది పోలీసలకు తెలిసి అతన్ని వెంబడిస్తారు.


డ్రగ్స్ తయారి

డ్రగ్స్ తయారి

కానీ.. నిజానికి డాడీ గిరిజ(జగపతిబాబు) కంపెనీ ఆయుర్వేద మందులు తయారు చేయడం లేదనీ, అదో గంజాయితో డ్రగ్స్ తయారు చేసే కంపెనీ అని పులి కుమార్‌కి తెలుస్తుంది. ఈ లోగా ఈ విషయం తెలిసిందని కుమార్ తమ్ముడుపై డాడీ మనుష్యలు ఎటాక్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పులి కుమార్‌కీ మైనా (కమలినీ ముఖర్జీ).. జూలీ (నమిత)లకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? లాంటి విషయాలు చూడాలంటే వెండితెర మీద సినిమాను చూడాల్సిందే.


విజువల్ ట్రీట్

విజువల్ ట్రీట్

ఈ సినిమా అంత పెద్ద హిట్ అవటానికి కారణం ఏమిటీ అంటే..దర్శకుడు స్క్రిప్టు మీద కన్నా విజువల్ గా తెర పై ఏమి కనపడితే ఎక్కువ ఇంపాక్ట్ వస్తుందనే విషయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఆవిష్కరించారు. దాంతో చూస్తున్న ప్రేక్షకుడుకి కొత్త ఎక్సపీరియన్స్ లభించింది. అలాగని స్క్రిప్టుని వదలేయమని కాదు..విజువల్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడని.


ఫోర్సెడ్ సీన్స్ ని ...

ఫోర్సెడ్ సీన్స్ ని ...

దర్శకుడు వైశాఖ్ ...సినిమా ప్రధాన పాత్ర అయిన మోహన్ లాల్ పైనే పూర్తి దృష్టి పెట్టి సీన్స్ రాసుకున్నారు. ఆయనలోని మాస్ ఏంగిల్ ని ఎలా ప్రెజెంట్ చేయాలనే దాన్నే ఎక్కువ కాన్సర్టేట్ చేసారని అర్దమవుతుంది. ముఖ్యంగా స్టంట్ సీక్వెన్స్ సినిమాలో అబ్బురపరుస్తాయి. అయితే ఫోర్స్ గా పెట్టిన కామెడీ సీన్స్ తెలుగులో తొలిగించటం కొంతవరకూ రిలీఫ్.


తీసేసినా ఏమీ తేడా లేదు

తీసేసినా ఏమీ తేడా లేదు

నమిత ట్రాక్ పెద్దగా ఆసక్తి రేపదు. సినిమాలో ఆ ట్రాక్ ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఉండదనిపిస్తుంది. అయితే మాస్ సినిమాల్లో హీరోకు ఇద్దరు హీరోయిన్స్ ఉండాలనే ఫార్మెట్ ఫాలో అయ్యి డైరక్టర్ ఆ పాత్రను పెట్టాడేమో అనిపిస్తుంది. అలాగే కథలో బాత్రూంలలోకి తొంగి చూసే క్యారక్టర్ ఒకటి పెట్టారు. అది కథకు ఏ మాత్రం ఉపయోగపడదు. మళయాళంలో కామెడీ పండించిందేమో కానీ తెలుగులో నప్పలేదు.


కథ,కథనం

కథ,కథనం

సినిమాలో స్క్రిప్టు అద్బుతమైనదేమీ కాదు. చాలా లూస్ గా ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. చాలా చోట్ల కథకు అవసరం లేని పాత్రలు రావటం వల్ల స్లో కూడా అవుతుంది. అలాగే సినిమాలో సపోర్టింగ్ పాత్రలు ,సబ్ ప్లాట్ లు ఎక్కవగా పర్పస్ లేకుండా వస్తూంటాయి. అయితే దర్శకుడు తన మ్యాజిక్ తో ఆ తేడా తెలియనివ్వడు.


రొటీన్ ని బ్రేక్ చేస్తూ...

రొటీన్ ని బ్రేక్ చేస్తూ...

సాధారణంగా మనకు అడవి నేపధ్యం అనగానే నిధి వేట, లేదా ఒసేయ్ రాములమ్మ, ఇవన్నీ కాకపోతే అడవిలో దెయ్యం కథలు వస్తూంటాయి. అయితే ఇదే నేపధ్యంలో ఓ మాస్ కథను చేయటం మాత్రం కొత్త విషయం. అడ్వెంచరస్‌గా సాగే యాక్షన్‌ సన్నివేశాలు.. విజువల్స్‌ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి.


సినిమా మొదట్లోనే...

సినిమా మొదట్లోనే...

సినిమా ప్రారంభమే ఆసక్తిని రేకెత్తిస్తుంది. హీరో తెరపై కనిపించక మునుపే ప్రేక్షకుడు కథలో లీనమైపోయేలా బ్యాక్ స్టోరీ పెట్టారు. పులికుమార్‌ చిన్నప్పటి ఎపిసోడ్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణ. సినిమా ఆరంభమైన తొలి ఇరవై నిమిషాల్లోనే బలమైన హీరోయిజంతో పాటు.. విలనిజం కూడా పండడం ఈ సినిమాకి బలం.


ఫ్యామిలీ సీన్సే కాస్తంత..

ఫ్యామిలీ సీన్సే కాస్తంత..

మోహన్‌లాల్‌ ఇంట్రడక్షన్.. ఆయన కూడా ఓ పులిని మట్టుబెట్టే సన్నివేశాల వరకు అంతా ఆసక్తికరంగానే అనిపిస్తుంది. కుటుంబ నేపథ్యంలో సన్నివేశాలు మొదలయ్యాక కథలో వేగం తగ్గినట్లు అనిపిస్తుంది. అవన్నీ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ తరహాలో డిజైన్ చేసినట్లు ఉంటాయి.


ఆ రెండు అరగంటలే...

ఆ రెండు అరగంటలే...

విలన్ ఎంట్రీ వరకూ హీరో ఫ్యామీలి సీన్స్ ,ఎమోషన్స్ తో నడిపారు. అవన్నీ పెద్దగా ఆసక్తి కలిగించలేదు. ప్రారంభంలో పులి నేపథ్యంలో వచ్చే తొలి అరగంట.. చివరి అర గంట సన్నివేశాలే సినిమాకి కీలకంగా నిలిచాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ కొన్ని ఎపిసోడ్స్‌ని తెరకెక్కించారు. ఆ సన్నివేశాలు అత్యంత సహజంగా అనిపించి కొత్త అనుభూతిని ఇచ్చాయి.


మరింతగా తీర్చిదిద్దాల్సింది

మరింతగా తీర్చిదిద్దాల్సింది

అలాగే ఈ సినిమాలో విలనిజం అంతగా పండలేదు. అయితే పులిని ఓ ప్రక్కన విలన్ గానూ, జగబతి బాబు పాత్రను మరో ప్రక్కన విలన్ గానూ తీర్చి దిద్దారు. కానీ జగపతిబాబు పాత్రని మరింత కీలకంగా తీర్చిదిద్దాల్సింది అనిపిస్తుంది చూస్తూంటే. ఎందుకంటే జగపతిబాబు పాత్రకు సరైన డైమన్షన్ లేదు. హీరోతో పోరాడటానికి క్లైమాక్స్ దాకా పెద్ద కారణం కూడా లేదు.


ఎందుకు పెట్టారో ఆ పాత్ర

ఎందుకు పెట్టారో ఆ పాత్ర

అలాగే ఎస్టేట్ ఓన‌ర్ కూతురిగా, స్థానిక యువ‌కుడు మోహన్ లాల్ పై క‌న్నేసిన పాత్రలో గ్లామ‌ర‌స్‌గా క‌నిపించే ప్రయ‌త్నం చేసింది న‌మిత‌. ఆ పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. నాలుగైదు సన్నివేశాల్లో ఇలా కనిపించి అలా మాయమైపోతుందంతే. గ్లామర్ టచ్ కోసం ఆ సీన్స్ పెట్టినట్లున్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. నమిత ఉన్నట్లు మనం ఫీల్ కాము. దానికి తోడు నమిత పాత్రను చూసి క‌మ‌లిని ముఖ‌ర్జీ ఉడుక్కునే స‌న్నివేశాలు పెద్దగా మెప్పించలేదు. నమిత పాత్రను తీసేయటమో లేక ఉంచితే ఆమె పాత్రకు ఓ పర్పస్ పెట్టి, బిగిన్,మిడిల్ , ఎండ్ ఇస్తే సమగ్రత వచ్చేది.


మరోస్దాయికి..

మరోస్దాయికి..

నిజం మట్లాడుకోవాలంటే...యాక్షన్ అభిమానులని దృష్టిలో ఉంచుకొని తీసిన ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు పీట‌ర్ హెయిన్స్ అని చెప్పాలి. అత‌ను రూపొందించిన సీన్స్ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. మన్యం పులిని మ‌రో స్థాయిలోకి తీసుకెళ్లాయి. వాటి మ‌ధ్య‌లో సాగే క‌థ మాత్రం బోర్ కొట్టిస్తుంది.


సాంకేతికంగా చెప్పాలంటే..

సాంకేతికంగా చెప్పాలంటే..

టెక్నికల్ గా ఈ సినిమాకి నూటికి నూరు మార్కులు వేయాలి. ఫొటోగ్ర‌ఫీ కూడా సూపర్బ్ గా ఉంది. మనం వెండితెరపై ఇది వ‌ర‌కు చూడ‌ని లొకేష‌న్లు అలిరించాయి. యాక్ష‌న్ సీన్స్ లో ఫొటోగ్ర‌ఫీ మరింతగా కేకపెట్టించింది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పక్కర్లేదు.


మోహన్ లాల్ ది గ్రేట్

మోహన్ లాల్ ది గ్రేట్

ఈ సినిమాలో ఓ సీన్ లో మోహ‌న్‌లాల్ వ‌చ్చి జ‌గ‌ప‌తిబాబు కాళ్లు ప‌డ‌తాడు. అలాగే మ‌రో స‌ీన్ లో మోహ‌న్‌లాల్‌ని క‌మ‌లిని ముఖ‌ర్జీ కాలుతో త‌న్నుతుంది. మన హీరోలు అయితే ఇలాంటి పాత్రని ఒప్పుకోరు. ఆ సీన్స్ పెట్టనివ్వరు. మోహన్ లాల్ అంత పెద్ద స్టార్ అయినా త‌న ఇమేజ్‌ను ప‌క్క‌న‌పెట్టి చేసిన స‌న్నివేశాలు ఆయనలోని గొప్ప నటుడుని ఆవిష్కరిస్తాయి.


వీళ్లే ఈ సినిమా కు పనిచేసివారు

వీళ్లే ఈ సినిమా కు పనిచేసివారు

సంస్థ: సరస్వతిఫిలిమ్స్‌
నటీనటులు: మోహన్‌లాల్‌, కమలినీ ముఖర్జీ, జగపతిబాబు, నమిత తదితరులు
కథ,కథనం: ఉదయ్‌కృష్ణ
ఎడిటింగ్: జాన్ కుట్టి, షిజాస్ పి.యూన‌స్‌,
విజువ‌ల్ ఎఫెక్ట్స్: విజ‌య్‌, స్రిస్‌, పిక్స్‌ల్‌,
సంగీతం: గోపీసుందర్‌
ఛాయాగ్రహణం: షాజికుమార్‌
ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌
పాటలు: వెన్నెలకంటి.. వనమాలి
దర్శకత్వం: వైశాక్‌
నిర్మాత: సిందూరపువ్వు కృష్ణారెడ్డి
విడుదల తేదీ: 02-12-2016


English summary
Mohanlal once again proves that age is just a number, with the spectacular performance in the movie. Manyam puli(Pulimurugan) is surely a perfect treat for the action movie lovers and Mohanlal fans. But as a film, it has its own flaws. Watch it for Mohanlal's one man show...!!!!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu