»   » పెళ్లైన హీరో నిర్వాకం: హీరోయిన్‌తో ‘సం’బంధం నిజమే!

పెళ్లైన హీరో నిర్వాకం: హీరోయిన్‌తో ‘సం’బంధం నిజమే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నువ్విలా మూవీతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటీ యామి గౌతమ్. తర్వాత ఆమె తెలుగులో గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఆమెకు తెలుగులో అవకాశాలు కూడా లేక పోవడంతో బాలీవుడ్ మీదనే ఎక్కవ ఫోకస్ పెట్టింది.

యామి గౌతమ్‌కి సినిమాల ద్వారా పెద్దగా పాపులారిటీ రాలేదుకానీ...ఎఫైర్ వార్తలతో పబ్లిసిటీ బాగా వచ్చింది. బాలీవుడ్ 'సనమ్ రే' అనే చిత్రంలో పులకిత్ సామ్రాట్ తో కలిసి నటించిన యామీ గౌతమ్ అతనితో ప్రేమలో పడింది. అయితే పులకిత్ సామ్రాట్‌కు అప్పటికే శ్వేతా రోహిరాతో వివాహం కావడం, శ్వేతా రోహిరా సల్మాన్ ఖాన్ రాఖీ సిస్టర్ కావడంతో ఈ వ్యవహారం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Also Read: బికినీతో రోడ్లపై చక్కర్లు: అందాల ఆరబోత ఇంత వైల్డ్‌గానా? (ఫోటోస్)

యామి గౌతమ్ తో తాను కొనసాగిస్తున్న 'సం'బంధం మీడియాకు లీక్ కావడంతో... ఈ జంట మరింత పబ్లిక్ అయ్యారు. మీడియాతో పాటు ఎవరేమనుకున్నా ఫర్వాలేదు, మా ఇష్టం వచ్చినట్లు ఉంటాం అనే విధంగా ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలు పెట్టారు. యామితో తను కలిసున్న సమయంలో కొందరు మీడియా వారు ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా వారిపై పులకిత్ దాడికి దిగినట్లు కూడా ఆ మధ్య ఆరోపణలు వచ్చాయి.

అయితే తన భార్య శ్వేతకు గర్భస్రావం అయినప్పటి నుంచే పులకిత్ ఆమెకు దూరమవుతూ వచ్చాడనే వార్తలు ఇటీవల కాలంతో మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పులకిత్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. భార్యకు దూరంగా ఉండటం, యామికి దగ్గరవ్వడం లాంటి అంశాలపై తేల్చి చెప్పాడు.

భార్య శ్వేతతో...

భార్య శ్వేతతో...

తన భార్యకు గర్భస్రావం అయినప్పటి నుంచే దూరమవుతూ వచ్చాననే ఆరోపణలను పులకిత్ సామ్రాట్ తోసిపుచ్చాడు.

అప్పటికి యామి తెలియదు

అప్పటికి యామి తెలియదు

మాతృత్వం ఎవరికైనా వరమే. కానీ తప్పాంతా నాదే అయినట్టు బురద చల్లుతున్నారు. ఎవరేం మాట్లాడినా ఇన్నాళ్లు సహించాను. నిజమేంటే బయట పెట్టేస్తా. శ్వేతకు గర్భస్రావం జరిగి నాలుగేళ్లైంది. అప్పటికీ యామి గౌతమ్ ఎవరో నాకు తెలియదు అని సామ్రాట్ తెలిపారు.

కావాలనే..

కావాలనే..

సానుభూతి పొందేందుకు నా ఇమేజ్ ను శ్వేత దెబ్బతీస్తొంది. వ్యక్తిగత విషయాలను బహిరంపరచి రచ్చ చేస్తోంది. ఆమె ఈవిధంగా ప్రవర్తిస్తుందని ఊహించలేదు అని సామ్రాట్ అన్నారు.

భార్యతో బంధం తెగినట్లే

భార్యతో బంధం తెగినట్లే

తన భార్య శ్వేత రొహిరతో కలిసుండలేనని పులకిత్ సామ్రాట్ స్పష్టం చేశాడు. తమ వివాహ బంధం తెగిపోయిందని ప్రకటించాడు.

యామితో..?

యామితో..?

పులకిత్ సామ్రాట్ మాటలను బట్టి యామి గౌతమ్ తో తన ‘సం'బంధం నిజమే అని తేలింది.

English summary
"I was shocked to read news articles about the miscarriage. I was like, “This is such a personal thing for any couple.” It was a tragic time for both of us. To put it out in public is not right. What shook my faith further was the fact that it was about a pious thing like motherhood, and the person, with whom I have spent so many years, would go to the extent of falsifying facts to malign my image and put it out in the public to gain sympathy." Pulkit Samrat said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more