»   » కోర్టు ఆవరణలో హీరో బరితెగింపు, అందరూ చూస్తుండగానే దాడి!

కోర్టు ఆవరణలో హీరో బరితెగింపు, అందరూ చూస్తుండగానే దాడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సాక్షాత్తు కోర్టు ఆవరణలోనే ఓ హీరో చట్టాన్ని ఉల్లంఘిస్తూ బరితెగింపు చర్యకు పాల్పడ్డారు. మీడియా ఫోటోగ్రాఫర్ పై అందరూ చూస్తుండగానే దాడికి దాగాడు. ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ నటుడు పులకిత్ సామ్రాట్.

పులకిత్ సామ్రాట్ అతని భార్య శ్వేతా రోహీరా కొంతకాలంగా విడివిడిగానే ఉంటున్నారు. ఇద్దరూ విడాకులు కేసుకు సంబంధించి ముంబై బంద్రాలోని ఫ్యామిలీ కోర్టుకు వచ్చారు. కోర్టు నుండి బయటకు వస్తున్న పులకిత్ ను మీడియా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసేందుకు ప్రత్నించడంతో..... ఆగ్రహానికి గురైన పులకిత్ దాడికి పాల్పడ్డారు.

 దాడి ఫోటోలు సోషల్

దాడి ఫోటోలు సోషల్

పులకిత్ సామ్రాట్ ఫోటోగ్రాఫర్ మీద దాడికి పాల్పడిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పులకిత్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 ఎఫైరే కాపురంలో కలతలకు కారణం

ఎఫైరే కాపురంలో కలతలకు కారణం

పులకిత్, శ్వేతా.....కాపురంలో కలతలు రావడానికి కారణం పులకిత్ మరో మహిళతో ఎఫైర్ కొనసాగించడమే. ఆమె మరెవరో కాదు నటి యామి గౌతమి అనేది అందరికీ తెలిసిందే. కొంతకాలంగా ఇద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారని టాక్.

 శ్వేతా కూడా ఎఫైర్ గురించి బహిరంగంగా

శ్వేతా కూడా ఎఫైర్ గురించి బహిరంగంగా

పులకిత్, యామి ఎఫైర్ గురించి శ్వేతా రోహిరా కూడా పలు ఇంటర్వ్యూల్లో బహిరంగంగానే చెప్పుకొచ్చింది. తాము ప్రేమ వివాహం చేసుకున్నామని.... తర్వాత పులకిత్ ఆలోచనలు పక్కదారి పట్టాయని, యామితో ఎపైర్ పెట్టుకున్నాడని శ్వేత పలు సందర్భాల్లో ఆరోపించారు.

 తన కూతురుతో ఆ పులకిత్ ఎఫైర్ ఉందని వారికి ముందే తెలుసా? అందుకే స్వీట్లు..?

తన కూతురుతో ఆ పులకిత్ ఎఫైర్ ఉందని వారికి ముందే తెలుసా? అందుకే స్వీట్లు..?

పుల్కిత్‌ శ్వేతాతో గొడవపడి ఢిల్లీలోని తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయాడు. వెళ్లిన రెండు రోజులకే యామి తల్లిదండ్రుల నుంచి పుల్కిత్‌కి స్వీట్‌ బాక్స్‌ అందినట్లు తాజాగా వార్తలు వెలుగులోకి వచ్చాయి.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Bollywood actor Pulkit Samrat attacked a photographer outside the court after his estranged wife Shweta Rohira filed for divorce.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu