»   » ఇంటర్ పరీక్షల్లో సాయం చేయండంటూ 'ఉయ్యాలా జంపాలా' హీరోయిన్!

ఇంటర్ పరీక్షల్లో సాయం చేయండంటూ 'ఉయ్యాలా జంపాలా' హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సోషల్ మీడియా ద్వారా ఎంత సేపు తమ ఫోటోలు పెట్టడం, తమ గొప్పలు చెప్పుకునే సెలబ్రెటీలు కనపడతారు. అయితే అరుదుగా కొద్ది మంది మాత్రం తమ పాపులారిటితో సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని తలపోస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే...

'ఉయ్యాలా జంపాలా' ' సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా నటించిన పునర్ణవి భూపాలం గుర్తుందా. అదేనండి ఈ మద్యన పిట్టగోడ చిత్రంలో కూడా హీరోయిన్ గా చేసింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పునర్ణవి భూపాలం సోషల్ మీడియాలో ఇంటర్ పరీక్షల్లో సాయం చేయమని పిలుపునిచ్చి గొప్పమనసు చాటుకుంది.


వారికి సాయం చేయమని కోరడంతోనే ఆగకుండా వాట్స్ యాప్ నెంబర్ కూడా తెలిపింది. సికింద్రాబాదులోని వెస్ట్ మారేడ్ పల్లిలోని కస్తూర్బా కళాశాలలో అంధవిద్యార్థులు చదువుతున్నారని, వారికి సహాయకులు అవసరమని తెలిపింది.

అవకాసం ఉన్నవారు స్పందిస్తే... ఇంటర్మీడియెట్ పరీక్షల్లో వారు చెప్పింది యథాతథంగా రాయగల సామర్థ్యమున్నవారు వారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరింది. కామర్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారైతే మరీ మంచిదని తెలిపింది. వారికి సహాయం చేసే గొప్ప మనసున్నవారంతా 9959580291 నెంబర్ కు వాట్స్ యాప్ చేయాలని సూచించింది. దీంతో వయసు చిన్నదైనా ఆమె సహాయం చేసే తత్వానికి సోషల్ మీడియాలో అద్భుత స్పందన లభిస్తోంది.

English summary
Punarnavi Bhupalam shared in FB: "NEED HELP FOR BLIND STUDENTS.100 blind students are having their intermediate examinations. Need people to help n write their exams. People with commerce background can only write.Kindness is the language which deaf can hear and the blind can see. Please join us. Let's help them."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu