»   »  పాక్ నటులపై నిషేదం సరైనదే: పవర్ స్టార్ స్పందన

పాక్ నటులపై నిషేదం సరైనదే: పవర్ స్టార్ స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూరీ ఘటన తర్వాత భారత్, పాక్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్ పాకిస్థాన్ నటులను నిషేధించడాన్ని కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సమర్ధించారు.

యూరి ఘటన తర్వాత భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో పాకిస్థాన్ నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, సంగీత దర్శకులు పనిచేసే సినిమాలపై సీవోఈఏఐ ( సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నిషేధం విధించింది.

Puneeth Rajkumar

ఈ పరిణామాలపై పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ స్పందిస్తూ... "కళ కంటే దేశం చాలా గొప్పది.. ముందు మనమందరం భారతీయులం ఆ తరువాతే కళాకారులం.. పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ సరైనదే" అని అన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఐశ్వర్యరాయ్, రణబీర్, అనుష్క ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ యే దిల్ హై ముష్కిల్ చిత్రం చిక్కుల్లో పడింది. 'యే దిల్‌ హై ముష్కిల్‌' సినిమాలో పాక్‌ నటుడు ఫవాద్‌ఖాన్‌ నటించమే ఇందుకు కారణం.

English summary
Puneeth Rajkumar given press statement about to ban Pakistani Artists. Puneeth Rajkumar Supports Ban on Pakistani Actors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu