»   » పైసా వసూల్ లో బాలయ్య లుక్ విషయమై మాట్లాడిన పూరీ

పైసా వసూల్ లో బాలయ్య లుక్ విషయమై మాట్లాడిన పూరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో..., టాలీవుడ్ హీరో..., పూరీ జగన్నాథ్ హీరో.. ముగ్గురూ ఒకటే కానీ మూడూ వేరు వేరు వేరు కూడా కన్‌ఫ్యూజ్ గా ఉందికదా. అదేమరి పూరీ జగన్నాథ్ హీరో కూడా అలానే ఉంటాడు. ఎవ్వరికీ అర్థం కాని క్యారెక్టర్, ఎవరికీ లొంగని ఆట్టిట్యూడ్‌తో దూసుకుపోయే హీరో లని డిజైన్ చేయటం లో పూరీ సిద్ద హస్తుడు. ఇడియట్ లో రవితేజా, పోకిరీలో మహేష్ బాబు, బద్రి లో పవన్ కళ్యాణ్ ఇలా ఒక్కో హీరోకీ అంతకు ముందున్న మార్క్ తీసిపడేసి పూర్తు స్థాయి యాంగ్రీ యంగ్ మాన్ లుక్ తీసుకురావటంలో పూరీపాత్ర లేదని చెప్పలేం. మాస్ హీరో అన్న పదానికి ఇంకో మెట్టు ఎక్కించిన దర్శకుడుగా పూరీని చెప్పుకోవాల్సిందే.

అప్పటివరకూ ఉన్న బాలయ్య వేరు

అప్పటివరకూ ఉన్న బాలయ్య వేరు

నిజానికి బాలయ్యా, పూరీ కాంబో అనగానే ఆనందం తో పాటూ చాలామందికి ఆశ్చర్యం కూడా కలిగిన మాట వాస్తవం, ఎందుకంటే అప్పటివరకూ ఉన్న బాలయ్య వేరు, పూరీ మార్క్ కి సరిపోయే హీరో వేరు. అసలూ ఈ కాంబో ఎలాఉంటుందీ అన్న ఆసక్తి మొదలయ్యింది.ఫస్ట్‌‌లుక్‌కే అంతా పడిపోయారు.

బాలయ్యని చూసి షాక్ తిన్నారు

బాలయ్యని చూసి షాక్ తిన్నారు

టీషర్ట్ జీన్స్, డిఫరెంట్‌గా ఉన్న మీసాలు.., టోటల్ బాడీ లాంగ్వేజ్ మారిపోయి ఫంకీ స్టైల్ లో కనిపిస్తున్న బాలయ్యని చూసి షాక్ తిన్నారంతా... ఇక టీజర్ వచ్చాక అయితే పిచ్చెక్కిపోయారు. అప్పటి దాకా తొడకొట్టి, వేటకొడవలీ, గొడ్దలీ లాంటి ఆయుధాలతో కనిపించిన బాలయ్య ఒక్కసారి ఇలా కనిపించటం అసలు ఎవ్వరూ ఊహించనిది. మరి ఈ కోణాన్ని అసలు పూరీ ఎలా ఊహించాడన్నదే అందరూ అనుకున్నది. ఆ ప్రశ్నకి తానే స్వయంగా ఆన్సర్ ఇచ్చాడు పూరీ

'బాలయ్యలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్

'బాలయ్యలో ఎంటర్టైన్మెంట్ యాంగిల్

ఇది ఎలా సాధ్యమైంది అని పూరిని అడిగితే.. ''బాలయ్యలో నేను ఎంటర్టైన్మెంట్ యాంగిల్ చూశా. ఆయన గత 15 ఏళ్లుగా సీరియస్ సినిమాలే చేస్తున్నారు. దాదాపుగా ఒకే మేనరిజమ్స్.. డైలాగ్ డెలివరీ మెయింటైన్ చేస్తున్నారు. అందుకే నేను కొంచెం డిఫరెంటుగా ట్రై చేశా. ఏ డైలాగ్ చెప్పినా కొంచెం నవ్వుతో చెప్పమని.. దానికి కామెడీ టచ్ ఇవ్వమని చెప్పా. అది బాగా వర్కవుటైంది'' అని పూరి తెలిపాడు.

బాలయ్య అండగా నిలిచాడు

బాలయ్య అండగా నిలిచాడు

'పైసా వసూల్' సినిమాతో బాలయ్య ఒక హీరోగానే కాక.. వ్యక్తిగానూ తనకు చాలా నచ్చాడని.. ఆయనపై తనకు ఎంతో గౌరవం పెరిగిందని పూరి చెప్పాడు. డ్రగ్స్ కేసుకు సంబంధించి తాను సిట్ అధికారుల విచారణకు హాజరైన సమయంలో తనతో పాటు తన కుటుంబం మొత్తానికి బాలయ్య అండగా నిలిచారని పూరి కొనియాడాడు.

English summary
Director Purijagannadh shared some movements About Balayya's Transformation For Paisa Vasool
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu