»   »  అపోలో ఆసుపత్రిలో పూరీ: కాల్పుల్లో గాయపడ్డ నిర్మాతని కలిసాడు

అపోలో ఆసుపత్రిలో పూరీ: కాల్పుల్లో గాయపడ్డ నిర్మాతని కలిసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ పూరీ జగన్నాధ్ పైసా వసూల్ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ కేసులో ఇంత ఒత్తిడిలో ఉన్నా ఆ ప్రభావం సినిమాపై పడకుండా పూరీ జాగ్రత్తపడుతున్నాడు. బాలకృష్ణ లాంటి స్టార్‌ను తన శైలికి తగ్గట్టుగా మార్చేసి, లుక్‌లో బాలయ్య అభిమానులు మెచ్చుకునే విధంగా చేసి సక్సెస్ అయ్యాడు పూరీ. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇవాళ పైసా వసూల్‌ స్టంపర్‌ను విడుదల చేశారు.

ఇంత బిజీ లోనూ పూరీ తన ప్రైవేట్ లైఫ్ నీ మనుషులతో తన రిలేషన్స్ నీ ఏమాత్రం అశ్రద్ద చేయటం లేదు. ఈరోజు కూడా పూరీ కాల్పుల్లో గాయపడ్డ విక్రమ్‌ గౌడ్‌ను పరామర్శించటానికి వెళ్ళాడు. జూబ్లీహిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్‌ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. కాగా విక్రమ్‌గౌడ్‌ సినిమా ప్రొడ్యూసర్‌గా కూడా చిత్రపరిశ్రమకు పరిచయం. సినీ హీరో నితిన్‌ సోదరి నిఖితారెడ్డితో కలిసి ఆయన శ్రేష్ట్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఇష్క్‌, గుండెజారి గల్లంతైయ్యిందే సినిమాలను నిర్మించాడు.


 Puri console Vikram Goud in Apollo Hospital

హైదరాబాదు, జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్ శరీరం నుంచి వైద్యులు తూటాలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపారు. దాడి ఎలా జరిగిందన్న విషయాన్ని విక్రమ్ చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. కుటుంబ కలహాలే కాల్పులకు కారణంగా భావిస్తున్నట్టు వివరించారు. 


English summary
Tollywood Director Puri Jagannadh who is facing Drug allegation is console Vikram Goud who attacked lost night
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu