»   »  'హార్ట్‌ ఎటాక్‌' గురించి పూరి జగన్నాథ్

'హార్ట్‌ ఎటాక్‌' గురించి పూరి జగన్నాథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నితిన్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న 'హార్ట్‌ఎటాక్‌' చిత్రం ఫస్ట్‌లుక్‌ నిన్న విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ''ప్రస్తుతం గోవాలో షెడ్యూల్‌ జరుపుతున్నామని ఈ షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తి అవుతుందని చెప్పారు. ఇదొక ప్రేమకథ. చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. త్వరలోనే గీతాల్ని విడుదల చేస్తాము''అన్నారు.

ఒంట్లో మూడు వేల కేలరీల శక్తిని కరిగించుకొనేందు కోసం... ఒక గంటపాటు ముద్దు కావాలని అడిగాడు ఓ కుర్రాడు. మరి ఆ అమ్మాయి సమాధానమేమిటో మా చిత్రం చూస్తే తెలుస్తుందంటున్నారు పూరి జగన్నాథ్‌. ఆయన దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న చిత్రం 'హార్ట్‌ ఎటాక్‌'. నితిన్‌, అదాశర్మ జంటగా నటిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లావణ్య సమర్పిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది.

Puri Jagan

హీరో,హీరోయిన్స్ ముద్దుకు సిద్ధమవుతున్నట్టున్న ప్రచార చిత్రంపై ఆంగ్లంలో ఓ ఆసక్తికరమైన సంభాషణ ఉంది. అది పూరి జగన్నాథ్‌ శైలిలో ఉంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. అనూప్‌రూబెన్స్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని లావణ్య సమర్పణలో పూరిజగన్నాధ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి స్వయంగా నిర్మిస్తున్నారు.

అలాగే ఈ చిత్రంలో నితిన్ పికలతో కనిపించనున్నారని తెలుస్తోంది. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది.

నితిన్ ఈసినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. నితిన్‌ సరసన అదాశర్మ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, పాటలు: భాస్కరభట్ల, కెమెరా: అమోల్‌ రాథోడ్‌, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌.

English summary
Heart Attack has already completed major part of the movie.Not just that, he is also readying it up for Sankranthi release. Currently he is filming it in Spain with lead actors Nithin and Adha Sharma. He tweets, "My HEART ATTACK movie is a love story, releasing on pongal."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu