For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాటి కోసమే జనం థియేటర్లకు రారు: పూరీ జగన్నాధ్

  By Srikanya
  |

  హైదరాబాద్ : సినిమాల్లో సందేశం ఇవ్వాలని నాకూ ఉంటుంది. కానీ వాటి కోసమే జనం థియేటర్లకు రారు. నిర్మాత డబ్బులతో ప్రయోగాలు చేయకూడదు. అందరినీ సంతృప్తిపరిచే సినిమా తీయడమే నా లక్ష్యం'' అంటున్నారు పూరి జగన్నాధ్. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరీ జగన్నాధ్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే...'సినిమా కోసం దర్శకుడు ఎంత కష్టపడ్డాడు, నిర్మాత ఎంత ఖర్చుపెట్టాడు? అనే విషయాలు ప్రేక్షకులకు అనవసరం. వాళ్లకు నచ్చిందా? లేదా? అనేదే చూస్తారు. పరిశ్రమకు ప్రయోగాలు కాదు. ఫలితాలు కావాలి అని చెప్పారు.

  ఇక తను సినిమాలు స్పీడుగా పూర్తి చేయటానికి కారణం వివరిస్తూ... ''దర్శకుడిగా కంటే నాకు డైలాగ్స్ రైటర్ గానే ఎక్కువ కిక్‌ వస్తుంటుంది. రాసేటప్పుడే.. సినిమాని చూసేస్తాను. ఏం చూశానో.. అదే తీస్తాను. అందుకే సినిమా వేగంగా పూర్తి చేయగలుగుతున్నానేమో..?'' అని చెప్పారు. అలాగే సినిమాకు ప్రాంతీయ భేధాలు లేవంటూ.. బాలీవుడ్‌లో అమితాబ్‌తో 'బుడ్డా' సినిమా తీశాను. ఇక్కడి ప్రేక్షకులకు ఏం నచ్చుతాయో.. అవే అంశాలను అక్కడా చూపించాను. భాష, ప్రాంతం... వీటితో సినిమాకి సంబంధం లేదు. 'పోకిరి' ఏ భాషలో తీసినా ఆడింది. అంతకంటే ఉదాహరణ కావాలా? అని ప్రశ్నించారు.

  ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌తో 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' సినిమా రూపొందిస్తున్నారు. ఆ తరవాత 'ఇద్దరమ్మాయిలతో...' చిత్రం మొదలుపెడతారు. యూనివర్శల్ మీడియా పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం 'కెమెరామెన్ గంగతో రాంబాబు'. తమన్నా హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం పాటలను బుధవారం మార్కెట్లోకి విడుదల చేశారు. రిలీజైన వెంటనే ఈ చిత్రం పాటలు మంచి క్రేజ్ తెచ్చుకుని..సినిమాపై హైప్ క్రియేట్ చేసాయి.

  'దిల్' రాజు మాట్లాడుతూ -'''కెమెరామెన్..'ని పంపిణీ చేస్తున్నాను. పదేళ్ల తర్వాత పవన్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించడం ఖాయం. ఈ ఆడియోలో నాకు మూడు పాటలు బాగా నచ్చాయి. ఏ ఆల్బమ్‌లో అయినా మూడు పాటలు నచ్చాయంటే అది సూపర్‌హిట్ కింద లెక్క'' అన్నారు. ''మణిశర్మ మంచి పాటలిచ్చారు. ఆర్‌ఆర్ కూడా అద్భుతంగా చేశారు. అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం'' అని దానయ్య చెప్పారు. పవన్‌కళ్యాణ్ అభిమానిగా ఈస్ట్‌గోదావరి జిల్లాలో ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నానని ముత్యాల రాందాస్ అన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. ధట్స్ తెలుగు ఈ దర్సకుడుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

  English summary
  Today, Ace director cum Producer Puri Jagannath is celebrating his birthday. At present he is busy with shooting of his upcoming film “Cameraman gangato Rambabu” with Pawan Kalyan and Tamanna as the lead pair. Puri is one of the prominent directors who tasted the Success and as well as failures in his professional career (film career) and he created his own kind of style in the industry. Not only Telugu, he also directed the films in Hindi and in Tamil languages.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X