For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  '...వుంచుకోవడానికి ఉంపుడుకత్తె కాదు' పై పూరీ వివరణ

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'ఉంచుకోడానికీ, ఉయ్యాల లూగడానికీ మీడియా ఎవరికీ ఉంపుడుగత్తె కాదు' అని పూరీ జగన్నాధ్ తన తాజా చిత్రంలో పవన్ కళ్యాణ్ చేత చెప్పించారు. ఈ డైలాగ్ వెనక వున్న సందర్భమేమిటి అని మీడియావారు అడిగితే...ప్రకాష్‌రాజ్‌తో పవన్‌కల్యాణ్ చెప్పే డైలాగ్ అది. మీడియా గురించి సిల్లీగా మాట్లాడిన ప్రకాష్‌రాజ్‌కు రాంబాబు ఇచ్చే కౌంటర్ సందర్భంలో ఆ డైలాగ్ వస్తుంది. ఏదో పంచ్‌ల కోసమో, టైమింగ్ కోసమో ఈ సినిమా డైలాగ్స్ రాయలేదు. సబ్జెక్ట్ డిమాండ్ మేరకే సంభాషణల్ని రాయడం జరిగింది. ఇందులో ప్రకాష్‌రాజ్-పవన్‌కల్యాణ్ కలయికలో వచ్చే సన్నివేశాలన్నీ హైలైట్‌గా వుంటాయి. ఇందులో ప్రకాష్‌రాజ్ పేరు రానాబాబు అన్నారు.

  'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో వార్తలు చూసి స్పందించి, అన్నాయాన్ని ఎదుర్కొనే పాత్రను కల్యాణ్ చేశాడు. అలాంటివాడు చానల్ రిపోర్టర్ అయ్యి, రాష్ట్రం ఎదుర్కొన్న ఓ సీరియస్ అంశాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేది కథాంశం. మీడియా గర్వంగా ఫీలయ్యే సినిమా. మీడియాను విలన్ తూలనాడితే, 'ఉంచుకోడానికీ, ఉయ్యాల లూగడానికీ మీడియా ఎవరికీ ఉంపుడుగత్తె కాదు' అని హీరో అంటాడు. అలాగే
  నాలుగేళ్ల క్రితం ఈ కథ రాసుకున్నాను. అప్పుడు, ఇప్పుడు రాజకీయాలు ఓకేలా వున్నాయి. ఈ చిత్రంలో రాజకీయ నాయకుడు రాష్ట్రం తగలపడిపోయే పరిస్థితిని తీసుకువస్తాడు. అతనికి కౌంటర్‌గా రాంబాబు చెప్పే డైలాగ్స్‌లో రాజకీయ సంభాషణలున్నాయి. అయితే అవి ఎవరినీ ఉద్ధేశించినవి కావు అన్నారు.

  ఇక 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చాలా సీరియస్ మోడ్‌లో సినిమా నడుస్తుంది. పూర్తి మాస్ ఎంటర్‌టైనర్. మీడియాపై జోక్స్ ఉన్నా అవి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ఉండవు. ఇటీవలే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. మణిశర్మ ఇచ్చిన రీ-రికార్డింగ్‌లో చిన్న కరెక్షన్ కూడా చేయలేదు. పవన్ ఎంతో మురిసిపోతూ డబ్బింగ్ చెప్పారు. ప్రస్తుతం డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోంది. 'గబ్బర్‌సింగ్' తర్వాత పవన్ సినిమా అంటే అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. ఆ అంచనాలకు మించిన రేంజ్‌లో ఉంటుందీ సినిమా అన్నారు.

  ప్రకాష్‌రాజ్‌, గ్యాబ్రియల్‌, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్‌ నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మ ణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: మణిశర్మ, నిర్మాణం: యూ నివర్సల్‌ మీడియా, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ-స్క్రీన్‌ప్లే- మాటలు-దర్శకత్వం: పూరి జగన్నాధ్‌.

  English summary
  
 Pawan Kalyan and Tamanna will be seen as the lead pair in ‘Cameraman Ganga tho Rambabu’ movie and Puri Jagan is the director. This hard hitting story is set against a politics vs media backdrop and Pawan will be seen as a courageous reporter who takes on an evil politician to save the state of Andhra Pradesh. Music has been scored by Mani Sharma and he has reportedly given a good background score for the movie. Danayya DVV is the producer of this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X