»   » కోళ్లు, మేకలకు ముసలితనం లేదంటూ పూరీ జగన్నాథ్

కోళ్లు, మేకలకు ముసలితనం లేదంటూ పూరీ జగన్నాథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మాంసం అమ్మకాల నిషేధంపై జరుగుతున్న వివాదంపై ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ విభిన్నంగా స్పందించారు. ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయనేం అన్నారో ఇక్కడ చూడండి. 


కోళ్లు, మేకలను అవి పూర్తి జీవితం గడపడానికి ముందే అందరూ కోసుకుని తినేస్తున్నారన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Puri Jagannath

ఇక పూరీ తాజా చిత్రం లోఫర్ విషయానికి వస్తే....

వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.కళ్యాణ్ నిర్మాత.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఫెమినా మిస్ ఇండియా 2013 రన్నరప్ దిషా పతాని ఈచిత్రంలో వరుణ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రమోషన్ ని కొత్తగా చేయాలని పూరి జగన్నాథ్ భావించారు. ఈ మేరకు ఆయన లొకేషన్ నుంచి షూటింగ్ లైవ్ ఇస్తున్నారు. ఆ లైవ్ ని చూడటం కోసం ఆయన తన Periscope ఛానెల్ లింక్ ని సైతం ట్వీట్ చేసారు.

ఈ చిత్రానికి సునిల్ కశ్యప్ సంగీతం అందించబోతున్నారు. బ్రహ్మానందం, రేవతి, పోసాని కృష్ణ మురళి తదితరులు ముఖ్య పాత్రలల్లో కనిపించనున్నారు.

పూరి జగన్నాథ్ సినిమా అంటేనే అదిరిపోయేలా ఐటం సాంగ్ ఉంటుంది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ పూరి జగన్నాథ్ అంచనాలకు ఏ మాత్రం తగట్గకుండా ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. మోరాకన్ డాన్సర్ నోరా పతేహితో ఈ చిత్రంలో స్పెషల్ఐటం సాంగ్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

నోరా పతేహి ఇప్పటికే టెంపర్, బాహుబలి, కిక్ 2 చిత్రాల్లో ఐటం సాంగ్స్ తో అదరగొట్టింది. తాజాగా ‘లోఫర్' చిత్రంలోనూ ఆమెసాంగ్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటుందని, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఇటీవలే రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఇందుకు సంబంధించిన సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో చరణ్ దీప్‌ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య వచ్చిన కళ్యాణ్ రామ్ ‘పటాస్', రీసెంట్‌గా విడుదలైన విజయ్ ‘జిల్లా' చిత్రంలో ప్రతినాయకుడిగా అలరించిన చరణ్ దీప్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 చిత్రంలో కూడా నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ కథాంశంగా రూపొందుతోందని టాక్.

English summary
Director puri jagannath tweeted on meat Ban. Now Puri Jagannath is in busy with his next Telugu film The film starring actor Varun Tej will be titled Loafer. This project will be Varun's first commercial film, according to producer C Kalyan.
Please Wait while comments are loading...